తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Toursim : రామప్ప దేవాలయానికి ముప్పు.. లెక్క తప్పితే తప్పదు తీవ్ర నష్టం!

Telangana Toursim : రామప్ప దేవాలయానికి ముప్పు.. లెక్క తప్పితే తప్పదు తీవ్ర నష్టం!

07 November 2024, 17:47 IST

Telangana Tourism : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం.. ప్రమాదపుటంచులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే.. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ప్రసిద్ధ ఆలయానికి ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు.

  • Telangana Tourism : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం.. ప్రమాదపుటంచులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే.. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ప్రసిద్ధ ఆలయానికి ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలో కాకతీయులు నిర్మించిన రామప్ప రామలింగేశ్వర ఆలయం ఉంది. ఇది ఒక అద్భుత కట్టడంగా ప్రపంచ ప్రఖ్యాతి పొంది యునెస్కో గుర్తింపు కూడా తెచ్చుకుంది. 
(1 / 5)
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలో కాకతీయులు నిర్మించిన రామప్ప రామలింగేశ్వర ఆలయం ఉంది. ఇది ఒక అద్భుత కట్టడంగా ప్రపంచ ప్రఖ్యాతి పొంది యునెస్కో గుర్తింపు కూడా తెచ్చుకుంది. (x)
ఎంతో ఖ్యాతి పొందిన ఈ రామప్ప దేవాలయానికి ముప్పు పొంచి ఉందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే బొగ్గు వెలికి తీసేందుకు సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్‌ కాస్టు మైనింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఆలయ ఉనికి పై అనేక సందేహాలు నెలకొన్నాయి. 
(2 / 5)
ఎంతో ఖ్యాతి పొందిన ఈ రామప్ప దేవాలయానికి ముప్పు పొంచి ఉందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే బొగ్గు వెలికి తీసేందుకు సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్‌ కాస్టు మైనింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఆలయ ఉనికి పై అనేక సందేహాలు నెలకొన్నాయి. (x)
2012లో వెంకటాపూర్ ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ కోసం సింగరేణి.. వెంకటాపూర్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, అడవి రంగాపురం, జవహర్ నగర్ చుట్టూ ఉన్న గ్రామాలతో కలిపి 1,088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు తవ్వకాలు జరిపేలా ప్రతిపాదన చేసింది.
(3 / 5)
2012లో వెంకటాపూర్ ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ కోసం సింగరేణి.. వెంకటాపూర్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, అడవి రంగాపురం, జవహర్ నగర్ చుట్టూ ఉన్న గ్రామాలతో కలిపి 1,088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు తవ్వకాలు జరిపేలా ప్రతిపాదన చేసింది.(x)
మళ్లీ గతకొద్దికాలంగా సింగరేణి ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలంలో బొగ్గు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సర్వేలో బొగ్గును వెలికి తీయడంతో రామప్ప ఆలయానికి ఎలాంటి హాని ఉండదని ధ్రువీకరించినట్టు వార్తలు వచ్చాయి. దీన్నీ ఆసరాగా తీసుకొని సింగరేణి బొగ్గు వెలికితీతకు సన్నాహాలు చేస్తున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ రామప్ప భద్రతపై జిల్లా ప్రజలు, మేధావులు ఆందోళన చెందతున్నారు.
(4 / 5)
మళ్లీ గతకొద్దికాలంగా సింగరేణి ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలంలో బొగ్గు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సర్వేలో బొగ్గును వెలికి తీయడంతో రామప్ప ఆలయానికి ఎలాంటి హాని ఉండదని ధ్రువీకరించినట్టు వార్తలు వచ్చాయి. దీన్నీ ఆసరాగా తీసుకొని సింగరేణి బొగ్గు వెలికితీతకు సన్నాహాలు చేస్తున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ రామప్ప భద్రతపై జిల్లా ప్రజలు, మేధావులు ఆందోళన చెందతున్నారు.(x)
కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప ఆలయం 800 ఏళ్లుగా.. భారీ వర్షాలు, వరదలు, తట్టుకొని చెక్కుచెదరకుండా నిలబడింది. అయితే.. మైనింగ్ అనుమతులు పొందిన తర్వాత పేలుడు పదార్థాలు ఉపయోగించడంలో ఏమాత్రం లెక్క తప్పినా.. రామప్ప ఆలయానికి ముప్పు జరుగుతుందని, భౌగోళికంగా రామప్ప చెరువు, రామప్ప దేవాలయం కింది భాగంలో మైనింగ్ జరిగే ప్రదేశం ఉండడంతో పేలుళ్ల దాటికి భూమి పొరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే రామప్ప చెరువు, ఆలయానికి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, రామప్ప చుట్టుపక్కల పర్యావరణంపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
(5 / 5)
కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప ఆలయం 800 ఏళ్లుగా.. భారీ వర్షాలు, వరదలు, తట్టుకొని చెక్కుచెదరకుండా నిలబడింది. అయితే.. మైనింగ్ అనుమతులు పొందిన తర్వాత పేలుడు పదార్థాలు ఉపయోగించడంలో ఏమాత్రం లెక్క తప్పినా.. రామప్ప ఆలయానికి ముప్పు జరుగుతుందని, భౌగోళికంగా రామప్ప చెరువు, రామప్ప దేవాలయం కింది భాగంలో మైనింగ్ జరిగే ప్రదేశం ఉండడంతో పేలుళ్ల దాటికి భూమి పొరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే రామప్ప చెరువు, ఆలయానికి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, రామప్ప చుట్టుపక్కల పర్యావరణంపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(x)

    ఆర్టికల్ షేర్ చేయండి