తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Banana Export Train : అరబ్‌ దేశాలకు అనంత అరటి - తాడిపత్రి నుంచి 'బనానా రైలు' బయల్దేరింది..!

AP Banana Export Train : అరబ్‌ దేశాలకు అనంత అరటి - తాడిపత్రి నుంచి 'బనానా రైలు' బయల్దేరింది..!

23 November 2024, 9:18 IST

Anantapur Banana Export Train : అనంతపురం అరటి చాలా ఫేమస్ అని తెలుసు. అయితే ఈ అరటి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి ప్రత్యేక రైలు(బనానా రైలు ) ముంబైకి బయల్దేరింది. ఇక్కడ్నుంచి షిప్ ద్వారా అరబ్ దేశాలకు పంపిస్తారు.

  • Anantapur Banana Export Train : అనంతపురం అరటి చాలా ఫేమస్ అని తెలుసు. అయితే ఈ అరటి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి ప్రత్యేక రైలు(బనానా రైలు ) ముంబైకి బయల్దేరింది. ఇక్కడ్నుంచి షిప్ ద్వారా అరబ్ దేశాలకు పంపిస్తారు.
అరటి తోటలకు అనంతపురం చాలా ఫేమస్. అయితే ఈ పండ్లకు అంతర్జాతీయంగానూ మంచి పేరుంది. ఈ సీజన్ లో ఇక్కడి అరటి పంటను అరబ్ దేశాలకు తరలిస్తున్నారు.
(1 / 6)

అనంతపురం జిల్లాలో పండే ఈ పంట… ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్‌ వంటి అరబ్‌ దేశాలకు  ఎగుమతి కానుంది. కేవలం విమానాల్లో కాకుండా… జల రవాణా మార్గాల ద్వారా ఖండాంతరాలు దాటనుంది.
(2 / 6)

జీ-9 అరటి రకం పంటను తరలించేందుకు తాడిపత్రి నుంచి శుక్రవారం ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  
(3 / 6)

34 బోగీల్లో 680 మెట్రిక్‌ టన్నులు అరటి పంటను రైలు ద్వారా ముంబైకి తరలించారు. ఈ సీజన్ లో ఇదే తొలి ట్రైన్ అని రైల్వే అధికారులు తెలిపారు.
(4 / 6)

ముంబై వరకి రైలు మార్గం ద్వారా చేరే ఈ అరటిని… అక్కడ్నుంచి ఓడల్లో రవాణా చేయనున్నారు. ఉద్యానశాఖ అధికారులు, ఎస్‌కే బనానా సంస్థ వారు ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు.
(5 / 6)

అరబ్‌ దేశాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా పంపడం ఇది రెండోసారి. గతంలోనూ భారీ స్థాయిలో పంపారు. ఈసారి జిల్లా ఉద్యానవనశాఖ, ఎస్కే ఎక్స్ పోర్ట్స్, CONCOR, దక్షిణ మధ్య రైల్వే భాగస్వామ్యంతో అరటి పండ్లను తరలించే కార్యక్రమం చేపట్టారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి