తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Govt Jobs 2024 : విద్యుత్ శాఖలో 3800 ఉద్యోగ ఖాళీలు..! త్వరలోనే నోటిఫికేషన్లు

TG Govt Jobs 2024 : విద్యుత్ శాఖలో 3800 ఉద్యోగ ఖాళీలు..! త్వరలోనే నోటిఫికేషన్లు

Published Oct 19, 2024 10:28 AM IST

TG Electricity Department Jobs 2024 : విద్యుత్ శాఖలోని ఖాళీలపై భర్తీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. TGNPDCLతో పాటు టీజీఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలోనే 4వేలలోపు పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. వీటిల్లో అత్యధికంగా లైన్ మెన్ ఉద్యోగాలున్నాయి.

  • TG Electricity Department Jobs 2024 : విద్యుత్ శాఖలోని ఖాళీలపై భర్తీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. TGNPDCLతో పాటు టీజీఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలోనే 4వేలలోపు పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. వీటిల్లో అత్యధికంగా లైన్ మెన్ ఉద్యోగాలున్నాయి.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇవ్వగా… రాత పరీక్షలు జరగనున్నాయి. త్వరలోనే  విద్యుత్తు పంపిణీ సంస్థల్లోఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది.
(1 / 6)

వరంగల్‌ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల్లో (టీఎన్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. 2260 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
(2 / 6)

TGNPDCL పరిధిలో అత్యధికంగా 2212 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇక  అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 11 పోస్టులు, 2.అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- 07 పోస్టులు, 3.సబ్ ఇంజినీర్ - 30 పోస్టులు, అన్ని కలిపి 2260 వరకు ఉన్నాయి. మరికొన్ని ఖాళీలను కూడా జత చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు.
(3 / 6)

టీజీఎస్పీడీసీఎల్‌లో పరిధిలో కూడా  1500 వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా  అత్యధికంగా జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు ఉన్నాయి. చివరి నోటిఫికేషన్ లో  అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో ఒక్క హైదరాబాద్​ పరిధిలోనే 200 వరకు పోస్టులు మిగిలిపోయాయి. వీటిని కూడా కలిపి ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంది.
(4 / 6)

TGSPDCL పరిధిలో  50 వరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల్లో కలిపి 4వేల లోపు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
(5 / 6)

మరోవైపు ఎస్సీ వర్గీకరణపై కమిటీ రిపోర్ట్ వచ్చాకే నోటిఫికేషన్లు ఇస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించింది. ఇప్పటికే కమిటీ ఏర్పాటైంది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నివేదిక అందిన తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తారా..? లేక ఈ నెలాఖారులోపే ప్రకటనలు వస్తాయనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో సర్కార్ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి