తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Govt Scheme : తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో కొత్త పథకం ప్రారంభం!

TG Govt Scheme : తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో కొత్త పథకం ప్రారంభం!

26 October 2024, 10:43 IST

TG Govt Scheme : తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలను కోటీశ్వరులుగా తిర్చిదిద్దేందుకు మరో పథకానికి రూపకల్పన చేస్తోంది. త్వరలోనే మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • TG Govt Scheme : తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలను కోటీశ్వరులుగా తిర్చిదిద్దేందుకు మరో పథకానికి రూపకల్పన చేస్తోంది. త్వరలోనే మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. త్వరలోనే ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. 
(1 / 5)
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. త్వరలోనే ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. (istockphoto)
ఇందిరా మహిళా శక్తి పథకానికి ఇప్పటికే రూపకల్పన పూర్తయిందని.. తొందరలోనే ప్రజల్లోకి తీసుకొస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో రక్షణ శాఖకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి వారికి ప్రోత్సాహం అందిస్తామని వివరించారు.
(2 / 5)
ఇందిరా మహిళా శక్తి పథకానికి ఇప్పటికే రూపకల్పన పూర్తయిందని.. తొందరలోనే ప్రజల్లోకి తీసుకొస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో రక్షణ శాఖకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి వారికి ప్రోత్సాహం అందిస్తామని వివరించారు.(istockphoto)
ఇందిరా మహిళా శక్తి ఉద్యామ్ ప్రోత్సాహన్ యోజనను రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం, మద్దతును అందిస్తున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.
(3 / 5)
ఇందిరా మహిళా శక్తి ఉద్యామ్ ప్రోత్సాహన్ యోజనను రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం, మద్దతును అందిస్తున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.(istockphoto)
మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి రాజస్థాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. ఈ స్కీమ్ ద్వారా రాజస్థాన్‌లో మహిళల్లో నిరుద్యోగాన్ని తగ్గించగలిగారు.
(4 / 5)
మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి రాజస్థాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. ఈ స్కీమ్ ద్వారా రాజస్థాన్‌లో మహిళల్లో నిరుద్యోగాన్ని తగ్గించగలిగారు.(istockphoto)
మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారు. మహిళలకు వ్యక్తిగత రుణం కింద గరిష్టంగా రూ. 5 లక్షలు, స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షలు అందిస్తుస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాగే ప్లాన్ చేసే అవకాశం ఉంది.
(5 / 5)
మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారు. మహిళలకు వ్యక్తిగత రుణం కింద గరిష్టంగా రూ. 5 లక్షలు, స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షలు అందిస్తుస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాగే ప్లాన్ చేసే అవకాశం ఉంది.(istockphoto)

    ఆర్టికల్ షేర్ చేయండి