తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు - వెదర్ అప్డేట్స్ వివరాలివే

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు - వెదర్ అప్డేట్స్ వివరాలివే

09 November 2024, 6:02 IST

AP Telangana Weather News : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్లు పిడుగులు పడొచ్చని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP Telangana Weather News : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్లు పిడుగులు పడొచ్చని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ఈ ప్రభావంతో.ఏపీలో రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(1 / 7)

గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉందని వివరించింది. 
(2 / 7)

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో.ఏపీలో రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(3 / 7)

ఇవాళ, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఆంధ్రప్రదే‌శ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలలో  శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయని వెల్లడించింది. 
(4 / 7)

మరోవైపు ఇవాళ, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 
(5 / 7)

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ వరకు కూడా తెలంగాణలో పొడి వాతారవణమే ఉంటుందని అంచనా వేసింది.ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది. 
(6 / 7)

నవంబర్ 15వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు పడుతాయని.. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది.మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతల్లో క్రమంగా పెరుగుదల నమోదు కానుంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి