తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రానికి భారీ వర్ష సూచన, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రానికి భారీ వర్ష సూచన, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Published Nov 21, 2024 05:26 PM IST

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. పంటలు చేతికందే సమయంలో ఏపీని తుఫాన్ల ముప్పు వెంటాడుతోంది.  ఈ నెల 23న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. దీనిప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

  • AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. పంటలు చేతికందే సమయంలో ఏపీని తుఫాన్ల ముప్పు వెంటాడుతోంది.  ఈ నెల 23న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. దీనిప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్ష సూచన ఉంది.  బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. పంటలు కోతలకు వచ్చే సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా హెచ్చరించారు. 
(1 / 7)

అల్పపీడనం నేపథ్యంలో  రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నవంబర్‌ 24 నుంచి అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని,  రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు
(2 / 7)

పలు జిల్లాలలో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని రెవిన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సూచించారు.
(3 / 7)

అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా, ఈ ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్న అంచనాలు ఉన్నాయని సిసోడియా తెలిపారు. 
(4 / 7)

అల్పపీడనం నేపథ్యంలో  విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని, 
(5 / 7)

ఈనెల 24వ తేదీ నుంచి అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా వివరించారు.
(6 / 7)

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది వరుస అల్పపీడనలతో తరచూ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు మినహా  రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి