తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - ఏపీలో 2 రోజులు వర్షాలు..! తాజా వెదర్ అప్డేట్స్ ఇవే

AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - ఏపీలో 2 రోజులు వర్షాలు..! తాజా వెదర్ అప్డేట్స్ ఇవే

Published Jan 10, 2025 03:09 PM IST

AP Telangana Weather Updates : ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP Telangana Weather Updates : ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం... ఇవాళ సరిహద్దు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది.
(1 / 7)
నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం... ఇవాళ సరిహద్దు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది.(image source @APSMDA)
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
(2 / 7)
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దక్షిణ కోస్తాలో ఇవాళ, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 
(3 / 7)
ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దక్షిణ కోస్తాలో ఇవాళ, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (image source @APSMDA)
ఇక రాయలసీమ జిల్లాలో చూస్తే.. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ంది. రేపు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడొచ్చని వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. 
(4 / 7)
ఇక రాయలసీమ జిల్లాలో చూస్తే.. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ంది. రేపు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడొచ్చని వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. (image source @APSMDA)
ఉపరితల ఆవర్తన ప్రభావం మరికొన్నిరోజలు ఉంటే… ఏపీలో మరో మూడు నాలుగు రోజులు కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.
(5 / 7)
ఉపరితల ఆవర్తన ప్రభావం మరికొన్నిరోజలు ఉంటే… ఏపీలో మరో మూడు నాలుగు రోజులు కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.(image source istock.com)
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో నాలుగైదు రోజులు ఇలాగే ఉంటుందని తాజా బులెటిన్ లో పేర్కొంది.  ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది.
(6 / 7)
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో నాలుగైదు రోజులు ఇలాగే ఉంటుందని తాజా బులెటిన్ లో పేర్కొంది.  ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది.
తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వివరించింది.  
(7 / 7)
తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వివరించింది.  (image source istock.com)

    ఆర్టికల్ షేర్ చేయండి