తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఉపరితల ఆవర్తన ప్రభావం - ఏపీలో తేలికపాటి వర్షాలు..! తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం

AP TG Weather Updates : ఉపరితల ఆవర్తన ప్రభావం - ఏపీలో తేలికపాటి వర్షాలు..! తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం

06 November 2024, 12:03 IST

AP Telangana Weather News : ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాతో పాటు సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.

  • AP Telangana Weather News : ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాతో పాటు సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.
ఆగ్నే బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య బంగాళాఖాతానికి విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 1. 5 కి. మీ ఎత్తులో విస్తరించిన ఉన్నట్లు పేర్కొంది. ఏపీ, యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది.  
(1 / 7)

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తాలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక సీమ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి లేదా ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.  
(2 / 7)

ఏపీలో ఇవాళ(నవంబర్ 06) నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నెల్లూరు,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(3 / 7)

తెలంగాణలో చూస్తే ఇవాళ్టి నుంచి నవంబర్ 11వ తేదీ వరకు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని అంచనా వేసింది. 
(4 / 7)

నవంబర్ 12, 13 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో తెలిపింది. 
(5 / 7)

ఇవాళ హైదరాబాద్ లో చూస్తే ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమైన ఉంటుంది. ఈశాన్య దిశలో ఉపరితల గాలులు వీచ్చే అవకాశం ఉంది.  
(6 / 7)

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం వేళలలో పొగమంచు తీవ్రత క్రమంగా పెరుగుతోంది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి