తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme : త్వరలోనే 'ఇందిరమ్మ ఇళ్లు' - తెరపైకి ప్రత్యేక యాప్..! తాజా అప్డేట్స్ ఇవిగో

TG Indiramma Housing Scheme : త్వరలోనే 'ఇందిరమ్మ ఇళ్లు' - తెరపైకి ప్రత్యేక యాప్..! తాజా అప్డేట్స్ ఇవిగో

22 September 2024, 13:56 IST

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అర్హులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోంది. 10 - 15 రోజుల వ్యవధిలో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….

  • TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అర్హులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోంది. 10 - 15 రోజుల వ్యవధిలో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే అర్హులను కూడా ఎంపిక చేసి మంజూరు పత్రాలను ఇవ్వాలని యోచిస్తోంది.
(1 / 5)

ఈ పథకాన్ని కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై అర్బన్‌, రూరల్‌) స్కీమ్ కు అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు అందుతాయి. 
(2 / 5)

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్ మార్గదర్శకాలు, విధివిధానాలు ఏ విధంగా ఉన్నాయనేదానిపై కొద్దిరోజుల కిందట గృహనిర్మాణ సంస్థ అధ్యయనం చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఏపీ రాష్ట్రాల్లో అధికారుల బృందాలు పర్యటించాయి. అక్కడ అమలవుతున్న విధానాలు, అర్హుల ఎంపికకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి కూడా  సమర్పించినట్టు సమాచారం.
(3 / 5)

ఈ క్రమంలోనే అర్హుల ఎంపిక ఎలా అనే దానిపై సర్కార్ మల్లాగుల్లాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి అవకతవలకు తావు లేకుండా ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని భావిస్తోంది. ఈ స్కీమ్ అమలు కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది, 
(4 / 5)

ఈ స్కీమ్ ను మార్చి 11వ తేదీన భద్రాచలం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 22 వేల 500 కోట్ల బడ్జెట్ తో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి