తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kazipet Railway Station : కాజీపేట్ రైల్వే జంక్షన్ కొత్త లుక్ చూశారా..! మారిపోనున్న రూపురేఖలు, ఈ ఫొటోలు చూడండి

Kazipet Railway station : కాజీపేట్ రైల్వే జంక్షన్ కొత్త లుక్ చూశారా..! మారిపోనున్న రూపురేఖలు, ఈ ఫొటోలు చూడండి

11 December 2024, 11:04 IST

Kazipet Railway Station Redeveloped : తెలుగు రాష్ట్రాల్లో  పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోతున్నాయి.“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” రైల్వే శాఖ… ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

  • Kazipet Railway Station Redeveloped : తెలుగు రాష్ట్రాల్లో  పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోతున్నాయి.“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” రైల్వే శాఖ… ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 
(1 / 6)

మొత్తం 24.5 కోట్ల రూపాయాలతో కాజీపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన డిజైన్ ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.
(2 / 6)

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా కాజీపేట్ రైల్వే జంక్షన్ స్టేషన్  ను ఆధునాతన స్టేషన్ గా మార్చబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్వే స్టేషన్ ముఖద్వారాల అభివృద్ధి,  ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలను ఈ స్కీమ్ లో భాగంగా ఏర్పాటు చేయనున్నారు.  స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్ స్కేపింగ్ వంటి వాటిని అభివృద్ధి చేస్తారు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
(3 / 6)

మరోవైపు యాదాద్రి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయబోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  దీనికి సంబంధించిన ప్రతిపాదిత డిజైన్‌లపై విడుదల చేసింది. ఆలయం రూపం వచ్చేలా యాదాద్రి స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. రూ.24.5 కోట్లతో పనులు చేపట్టనున్నారు.
(4 / 6)

రైల్వే స్టేషన్ల అప్ గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా.. తెలంగాణలో మొత్తం 39 స్టేషన్లను రైల్వేశాఖ గుర్తించింది. వీటిని పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో తెలంగాణ నుంచి 21 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా… స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లో స్వచ్ఛత ఉండేలా చూడటం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్ , టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తారు. 
(5 / 6)

అభివృద్ధి చేసే రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ షాపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకం, చిన్న గార్డెన్లు వంటివి ఏర్పాటు చేస్తారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి