HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఐటీ ఉద్యోగులకు షాక్​ తప్పదా? ఇక నుంచి రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనా!

ఐటీ ఉద్యోగులకు షాక్​ తప్పదా? ఇక నుంచి రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనా!

22 July 2024, 13:08 IST

దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్​గా గుర్తింపు పొందింది బెంగళూరు మహా నగరం. అయితే కర్ణాటకలో మాత్రం ఐటీ ఉద్యోగుల జీవితాలను దుర్భరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగుల పని గంటలను 10 నుంచి 14కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది!

  • దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్​గా గుర్తింపు పొందింది బెంగళూరు మహా నగరం. అయితే కర్ణాటకలో మాత్రం ఐటీ ఉద్యోగుల జీవితాలను దుర్భరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగుల పని గంటలను 10 నుంచి 14కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది!
కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భారత యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని సూచించారు. ఆ ప్రతిపాదన ఇప్పుడు కర్ణాటకలో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల రోజువారీ పనిగంటలను 10 గంటల నుంచి 14 గంటలకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
(1 / 5)

ఐటీ, ఐటీఈఎస్, బీపీవోలో పనిచేసే ఉద్యోగి అవసరమైతే రోజుకు 12 గంటలకు మించి ఓవర్ టైమ్ పని చేసే వెసులుబాటు కల్పిస్తూ కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్​మెంట్స్ యాక్ట్ 1961ను సవరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.  
(2 / 5)

ప్రస్తుత కార్మిక చట్టం ప్రకారం రోజుకు గరిష్ఠ పని సమయం 12 గంటలు. ఒక ఉద్యోగి వారానికి గరిష్టంగా 48 గంటలు పని చేయవచ్చు. అయితే పనివేళల పొడిగింపుపై చర్చించేందుకు కర్ణాటక ఐటీ కంపెనీలతో సమావేశం నిర్వహించింది. 14 గంటల పనిని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయిస్ యూనియన్ వ్యతిరేకించింది.
(3 / 5)

ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి మహ్మద్ మొహ్సిన్, ఐటీ-బీటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎకార్ప్ కౌర్లను కలిసి తమ విభేదాలను స్పష్టం చేశారు.
(4 / 5)

ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఐటీ రంగంలోని పలువురు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఉద్యోగుల గరిష్ట పని సమయం పెరిగితే షిఫ్ట్ కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో బీపీవో లేదా ఐటీ కంపెనీ మూడు షిఫ్టులకు బదులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా తమ జేబులను కాపాడుకోవాలనుకుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి