తెలుగు న్యూస్  /  ఫోటో  /  జాతకంలో కళత్ర దోషం ఉందా? పెళ్లి కోసం ఈ పరిహారాలు చేయాలి!

జాతకంలో కళత్ర దోషం ఉందా? పెళ్లి కోసం ఈ పరిహారాలు చేయాలి!

19 January 2024, 6:41 IST

ఎంత ప్రయత్నించినా కొంతమందికి త్వరగా పెళ్లి జరగదు. అయితే.. జాతకంలో కళత్ర దోషం ఉంటే ఇలా జరిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీని కోసం కొన్ని పరిహారాలు చేస్తే గుడ్​ న్యూస్​ వింటారని అంటున్నారు.

  • ఎంత ప్రయత్నించినా కొంతమందికి త్వరగా పెళ్లి జరగదు. అయితే.. జాతకంలో కళత్ర దోషం ఉంటే ఇలా జరిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీని కోసం కొన్ని పరిహారాలు చేస్తే గుడ్​ న్యూస్​ వింటారని అంటున్నారు.
జాతకంలో 7వ ఇంటిని కళత్ర స్థానం అని అంటారు. ఇది జీవిత భాగస్వామి స్థానం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక్కడ దోషం ఉన్న వారికి వివాహం ఆలస్యమవుతుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు.
(1 / 5)

కళత్ర దోషం ఉండి, పెళ్లి చూపులు ఫలించి, నిశ్చితార్థం వరకు వెళ్లినా.. చివరిలో పెళ్లి ఆగిపోయే అవకాశం కూడా ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు. పెళ్లికి శుభ ముహూర్తం చాలా ముఖ్యం. కళత్ర దోషం ఉంటే.. ఆ శుభ ముహూర్తాన్ని కనుక్కోవడం కూడా కష్టమవుతుందని చెబుతున్నారు.
(2 / 5)

కళత్ర దోష ప్రభావాన్ని తగ్గించేందుకు పలు మార్గాలు, పరిహారాలు ఉన్నాయి. వీటిని.. శుక్రవారాలు, ఆదివారాలు పాటిస్తే.. మంచి ఫలితాలను చూడవచ్చు.
(3 / 5)

కళత్ర దోషం ఉన్న వారు అరటి చెట్టుతో వివాహం చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే.. కళత్ర దోషానికి ఉన్న చెడు ప్రభావం చెట్టుకు బదిలీ అవుతుందని అంటోంది. కుంభ (కలశం) వివాహం కూడా చేసుకోవచ్చని సూచిస్తోంది.
(4 / 5)

కళత్ర దోషంతో కారణంగా ఇబ్బంది పడుతున్న వారు.. శివపార్వతులకు నిత్యం ప్రార్థనలు చేయాలి. శివుడు, పార్వతీ దేవీ ఆశీర్వాదాలు లభిస్తే.. కళత్ర దోష ప్రభావం తగ్గి, త్వరలోనే శుభవార్త వింటారని జ్యోతిష్కులు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్​లోని శ్రీ కాళహస్తి ఆలయాన్ని సందర్శిస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి