తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు.. ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవే

Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు.. ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవే

22 September 2024, 15:58 IST

Dasara Navaratri : బెజవాడలోని ఇంద్రకీలాద్రి.. దసరా నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబవుతోంది. నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం.. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

  • Dasara Navaratri : బెజవాడలోని ఇంద్రకీలాద్రి.. దసరా నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబవుతోంది. నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం.. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
దసరా నవరాత్రి ఉత్సవాలు.. ఈ మాట వినగానే అమ్మవారి భక్తులకు గుర్తొచ్చేది బెజవాడలోని ఇంద్రకీలాద్రి. ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
(1 / 5)

దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు ఈ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే బెజవాడ దుర్గమ్మ అవతారాల తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు.
(2 / 5)

అక్టోబర్ 3న అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీ గా దర్శనమిస్తారని అధికారులు వివరించారు. 
(3 / 5)

అక్టోబర్ 8న మహాలక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 9న సరస్వతి , 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరించనున్నారు.
(4 / 5)

మూలా నక్షత్రం రోజు అక్టోబర్ 9న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో.. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు వివరించారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి