తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Ire: అదరగొట్టిన జెమీమా.. టీమిండియా భారీ గెలుపు.. వన్డే సిరీస్ కైవసం

IND vs IRE: అదరగొట్టిన జెమీమా.. టీమిండియా భారీ గెలుపు.. వన్డే సిరీస్ కైవసం

12 January 2025, 21:28 IST

INDW vs IREW 2nd ODI: ఐర్లాండ్‍తో వన్డే సిరీస్‍ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. నేడు (జనవరి 12) జరిగిన రెండో వన్డేలో భారీ తేడాతో విజయం సాధించింది. ఆ వివరాలు ఇవే..

  • INDW vs IREW 2nd ODI: ఐర్లాండ్‍తో వన్డే సిరీస్‍ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. నేడు (జనవరి 12) జరిగిన రెండో వన్డేలో భారీ తేడాతో విజయం సాధించింది. ఆ వివరాలు ఇవే..
ఐర్లాండ్‍తో వన్డే సిరీస్‍ను 2-0తో దక్కించుకుంది టీమిండియా. రాజ్‍కోట్ వేదికగా నేడు (జనవరి 12) జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు దుమ్మురేపింది. 116 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 
(1 / 5)

ఈ మ్యాచ్‍లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విజృంభించారు. 91 బంతుల్లోనే 102 పరుగులతో అదరగొట్టారు. వన్డేల్లో తన తొలి శతకం చేశారు. సెంచరీ బాదాక బ్యాట్‍ను గిటార్‌లా పట్టుకొని సెలెబ్రేట్ చేసుకున్నారు జెమీమా.
(2 / 5)

జెమీమా శతకంతో రాణించగా.. కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73 పరుగులు), ప్రతిక రావల్ (67 పరుగులు), హర్లీన్ డియోల్ (89) అర్ధ శతకాలు చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏకంగా 50 ఓవర్లలో 5 వికెట్లకు 370 పరుగుల భారీ స్కోరు చేసింది.
(3 / 5)

భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్ తడబడింది. ఆ టీమ్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. 50 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులే చేసింది ఐర్లాండ్. క్రిస్టినా కల్టర్ రేలీ (80) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. 
(4 / 5)

భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. ప్రియా మిశ్రా రెండు, టిటాస్ సంధు, షాయాలి సత్ఘరే తలా ఓ వికెట్ తీశారు. మొత్తంగా 116 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత మహిళల జట్టు. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి