తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sweating Problem: అతిగా చెమటలు పడితే అది హైపర్‌ హైడ్రోసిస్ కావొచ్చు… వైద్యుల్ని సంప్రదించాల్సిందే…!

Sweating Problem: అతిగా చెమటలు పడితే అది హైపర్‌ హైడ్రోసిస్ కావొచ్చు… వైద్యుల్ని సంప్రదించాల్సిందే…!

30 September 2024, 11:40 IST

Sweating Problem: విపరీతంగా చెమట పడితే "హైపర్ హైడ్రోసిస్” (Hyper Hidrosis) అనే వ్యాధి వస్తుంది.దుర్వాసనతో కూడిన"బ్రొమిడ్రోసిస్" (Bromidrosis)అనే వ్యాధి వస్తుంది. చెమటే దుర్గంధ పూరితం,దానిలో ఉండే లవణాలకు బాక్టీరియా తోడయితే మరింత దుర్గంధ భరితం అవుతుంది. పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

  • Sweating Problem: విపరీతంగా చెమట పడితే "హైపర్ హైడ్రోసిస్” (Hyper Hidrosis) అనే వ్యాధి వస్తుంది.దుర్వాసనతో కూడిన"బ్రొమిడ్రోసిస్" (Bromidrosis)అనే వ్యాధి వస్తుంది. చెమటే దుర్గంధ పూరితం,దానిలో ఉండే లవణాలకు బాక్టీరియా తోడయితే మరింత దుర్గంధ భరితం అవుతుంది. పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
దుర్వాసనతో కూడిన "బ్రొమిడ్రోసిస్" (Bromidrosis)అనే వ్యాధి వస్తుంది. చెమటే దుర్గంధ పూరితం, దానిలో ఉండే లవణాలకు బాక్టీరియా తోడయితే మరింత దుర్గంధ భరితం అవుతుంది. 
(1 / 8)

చెమట సమస్యను అధిగమించడానికి  ఎక్కువ సార్లు స్నానం చేయటం,వదులుగా ఉండే దుస్తులు ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.మెడికేటెడ్ సబ్బులు కూడా వాడొచ్చు. పౌడర్లూ, సెంట్లూ వాడుతుంటారు.వీటి వాడకం వల్ల సమస్య పరిష్కారం కాదు. వ్యాధి మూలకారణం పోదు. పక్కనున్న వారికి దుర్గంధం తెలియకుండా ఉంటుంది.
(2 / 8)

విపరీతంగా చెమట పడితే  "హైపర్ హైడ్రోసిస్” (Hyper Hidrosis) అనే వ్యాధి వస్తుంది.
(3 / 8)

ఎర్రగా లేదా నీలం రంగు చెమటతో "క్రోమిడ్రోసిస్" (Chromidrosis) అనే వ్యాధి రావచ్చు.అసలు చెమట పట్టకుండా ఉండే "ఎన్ హైడ్రోసిస్" (Androsis) అనే వ్యాధి వస్తే చెమట పట్టటం వలన కలిగే లాభాలన్నింటికీ గండిపడినట్లే అవుతుంది.
(4 / 8)

చెమట పట్టే కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మరింత జాగ్రత్త పడాలి. చెమట పట్టి చర్మంలో నుండి బయటకు రాలేక చెమట గుల్లలుగా తేలే "మిలియేరియా" (Miliaria) అనే వ్యాధి వస్తుంది అరుదుగా. వేసవి కాలంలో చెమట పొక్కులు రావటం, "పేలటం" ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే! స్వేదగ్రంథుల వ్యాధుల్లో ప్రమాదం కల్గించేవి ఉన్నాయి, నిరపాయకరమైనవీ ఉన్నాయి.అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. 
(5 / 8)

చేతుల పై భాగంలోనూ, ఛాతీమీదా, పొట్టపై చర్మంలోనూ వీటి సంఖ్య తక్కువగా ఉంటుంది.తడి ఎక్కువగా ఉండటానికవకాశమున్న గజ్జలు, పాదాల వ్రేళ్ళ మధ్యా ఫంగస్ అభివృద్ధి చెందుతుంది. "ఆస్పర్జిల్లస్" అనే శిలీంధ్రము చర్మము, చెవి, ఊపిరితిత్తులలో వ్యాధిని కలిగిస్తుంది. ఇలా చర్మంలోకి ప్రవేశించే బాక్టీరియాలో “స్టెఫెలోకోకస్ ఆరియాస్" వలన మొటిమలు, కురుపులు వస్తాయి.
(6 / 8)

స్నానం చేయటం వలన చర్మంపై దుమ్మ, ధూళి కణాలు, కొన్ని నూనెలాంటి స్రావాలు (Oily Secretions), సూక్ష్మ జీవులూ పోయి చర్మం కొంతవరకు శుభ్ర పడుతుంది. కానీ, బిలియన్ల కొద్దీ ఈస్ట్ సూక్ష్మజీవులు, ఫంగస్, ఇంకా చర్మం మీద మిగిలిన బాక్టీరియా - ఇవన్నీ చర్మంమీద తిష్టవేసే ఉంటాయి. ఎంత రుద్ది రుద్ది స్నానం చేసినా ఇవి పోవు.
(7 / 8)

చర్మంమీద స్వేదగ్రంథులు విడుదలచేసే "సెబమ్” (Sebum) అనే ఆయిల్ లాంటి పదార్థంతో ఈ సూక్ష్మజీవులు మరింతగా పెరుగుతాయి.ముఖం, మెడ, చంకలు, జననేంద్రియ ప్రదేశాలలో ఈ క్రిములు ఎక్కువగా ఉంటాయి. ఒక చదరపు సెంటీ మీటరు చర్మంలో ఈ క్రిములు 2, 4 మిలియన్ల వరకూ ఉంటాయని అంచనా!
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి