తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Report : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

AP TG Weather Report : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

14 November 2024, 16:05 IST

AP Telangana Weather News : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.

  • AP Telangana Weather News : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం దక్షిమ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది.  
(1 / 6)
నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం దక్షిమ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశలో గాలుల వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)
ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశలో గాలుల వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఉత్తర కోస్తాలో ఇవాళ ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. 
(3 / 6)
ఉత్తర కోస్తాలో ఇవాళ ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. (image source pixabay )
మరోవైపు దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. సీమ జిల్లాల్లో మోస్తారు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.  
(4 / 6)
మరోవైపు దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. సీమ జిల్లాల్లో మోస్తారు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.  (image source pixabay )
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ్టి నుంచి నవంబర్ 16వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. 
(5 / 6)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ్టి నుంచి నవంబర్ 16వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. (image source pixabay )
నవంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  
(6 / 6)
నవంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  (image source pixabay )

    ఆర్టికల్ షేర్ చేయండి