తెలుగు న్యూస్  /  ఫోటో  /  Electricity Charges: ఏపీ ప్రజలపై రూ.17వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం సిద్ధం, రద్దు చేయాలని సీపీఎం డిమాండ్

Electricity Charges: ఏపీ ప్రజలపై రూ.17వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం సిద్ధం, రద్దు చేయాలని సీపీఎం డిమాండ్

05 November 2024, 14:17 IST

Electricity Charges:  ఏపీలో  విద్యుత్ ట్రూ అప్‌ ఛార్జీల వసూళ్లకు ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన బాట పట్టింది.విద్యుత్ కంపెనీల సర్దుబాటు ఛార్జీలకు అనుమతివ్వడం ద్వారా వినియోగదారులపై రూ.17వేల కోట్ల భారం పడుతుందని,  నోటిఫికేషన్లు రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. 

  • Electricity Charges:  ఏపీలో  విద్యుత్ ట్రూ అప్‌ ఛార్జీల వసూళ్లకు ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన బాట పట్టింది.విద్యుత్ కంపెనీల సర్దుబాటు ఛార్జీలకు అనుమతివ్వడం ద్వారా వినియోగదారులపై రూ.17వేల కోట్ల భారం పడుతుందని,  నోటిఫికేషన్లు రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. 
విద్యుత్  ట్రూ అప్ చార్జీల తాజా భారాలపై విజయవాడలో సిపిఎం ఆందోళనకు దిగింది. ట్రూ అప్‌ చార్జీల నోటిఫికేషన్ కాపీలను  దగ్ధం చేసి నిరసన తెలిపారు.  మొత్తం 17 వేల కోట్ల రూపాయల ఛార్జీలను వసూలు చేయాలనే నిర్ణయాన్ని సీపీఎం తప్పు పడుతోంది.  గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దకుండా, ప్రజలను శిక్షించడం తగదని,  విద్యుత్ భారాలపై వైసీపీ దారిలోనే టిడిపి, జనసేన, బిజెపి సర్కార్ నడుస్తున్నాయని,  ఈనెల 8 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు  14వ తేదీన ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు.
(1 / 6)

6072 కోట్ల రూపాయల విద్యుత్  ట్రూ అప్ ఛార్జీల ఆదేశాలు తడి ఆరకుండానే నేడు తాజాగా మరొక 11 వేల కోట్ల రూపాయలు అదనంగా ట్రూ అప్ చార్జీలను భారం వేయడాన్ని, మొత్తం 17 వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీలు ప్రజలపై మోపడాన్ని  వ్యతిరేకిస్తూ సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా  నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థల తాజా నోటిఫికేషన్ కాపీలను నేతలు, కార్యకర్తలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. కూటమి విద్యుత్ బాదుడు ను నిరసిస్తూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు సామాన్యుడిపై కూటమి పార్టీలు భారాన్ని ప్రతిబింబిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు
(2 / 6)

విద్యుత్ ఛార్జీలపై  టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రభుత్వం మాట తప్పిందని,  ప్రజలను మోసగించిందని సీపీఎం ఆరోపించింది.  6072 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు భారం ఆదేశాల సిరా తడి ఆరకముందే మరో 11 వేల కోట్ల రూపాయల భారం వేస్తూ నియంత్రణ మండలి పేరుతో పంపిణీ సంస్థలు  నోటిఫికేషన్ ఇవ్వటం దారుణమని  దీని వలన 2023 -24 సంవత్సరంలో వినియోగించుకున్న విద్యుత్ పై ప్రతి యూనిట్ కు 50 పైసల నుండి రూ.2 50 పైసలు వరకు భారం పడుతుందని తెలిపారు.  గతవారం ఇచ్చిన ఆదేశాల్లో 2022 - సంవత్సరంలో వినియోగించుకున్న విద్యుత్ పై యూనిట్ కు రూ. 1.50 పైసలు పైగా అదనపు సర్దుబాటు చార్జీలు 15 నెలల పాటు వసూలు చేస్తారు. 
(3 / 6)

గత ప్రభుత్వం మాదిరి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, చార్జీలు తగ్గిస్తామని నమ్మ బలికిన చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ ప్రజలను వంచించారని,  వైసీపీ ప్రభుత్వ దారిలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో నడవడం శోచనీయమని సీపీఎం నేతలు ఆరోపించారు.  ఒకవైపున నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు సతమతమవుతుండగా ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం వేయటం గర్హనీయమన్నారు.  ఉచిత సిలిండర్ల పేరుతో 2500 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు, మరోవైపు 17 వేల కోట్ల రూపాయల భారం వేసి ప్రజల జేబులు ఖాళీ చేయటం మోసపూరితమని,   ఈ విద్యుత్ భారాలకు తమకు సంబంధం లేదని విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. 
(4 / 6)

 గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది విద్యుత్ భారాలు తగ్గిస్తామని మాట ఇచ్చిన నేతలు నేడు మాట మార్చడం సరికాదని, గత ప్రభుత్వం చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలకు కూటమి ప్రభుత్వం ఆమోదముద్ర వేసి ప్రజల నెత్తిన వేయటం దారుణం ప్రభుత్వాల తప్పులకు ప్రజలను శిక్షిస్తారా? వైసిపి ప్రభుత్వం అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ సర్దుబాటు చార్జీల ఆదేశాలు ఉపసంహరించాలని నియంత్రణ మండలికి లేఖ రాయాలని,  విద్యుత్ రంగంలో అవినీతి అక్రమాలు అరికట్టి ట్రూ అప్ కాకుండా ట్రూ డౌన్ చేసి చార్జీలు తగ్గించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 
(5 / 6)

గత ప్రభుత్వం బడా కంపెనీలకు చెల్లించిన అక్రమ సొమ్మును తిరిగి రాబట్టాలని,  అడ్డగోలు ఒప్పందాలను రద్దు చేయాలని అదానీ కంపెనీతో సోలార్ విద్యుత్ పై చేసుకున్న అక్రమ ఒప్పందాలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆమోదముద్ర వేయటం భావ్యం కాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆ ఒప్పందాలను రద్దు చేయాలని  డిమాండ్ చేశారు.  2024 నవంబర్ నుండి 2026 జనవరి వరకు 15 నెలల పాటు  ట్రూ అప్ చార్జీల వసూళ్లకు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని,  నేడు జారీ చేసిన 11 వేల కోట్ల రూపాయల నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  విద్యుత్ భారాలపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని  ఈనెల 8వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం విద్యుత్ భారాలను తగ్గించాలని, అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళన చేపడుతామన్నారు.  14వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి