తెలుగు న్యూస్  /  ఫోటో  /  Passenger Crowd Control: అటెన్షన్ ప్లీజ్, క్యూ పద్ధతి పాటించండి.. విజయవాడ రైల్వే స్టేషన్లో క్యూలో వెళ్లాల్సిందే…

Passenger Crowd Control: అటెన్షన్ ప్లీజ్, క్యూ పద్ధతి పాటించండి.. విజయవాడ రైల్వే స్టేషన్లో క్యూలో వెళ్లాల్సిందే…

31 October 2024, 11:13 IST

Passenger Crowd Control: పండుగ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్‌లో రాకపోకల్ని క్రమబద్దీకరించడానికి విజయవాడలో క్యూ పద్ధతి ప్రవేశపెట్టారు. ప్రయాణికులు  నిర్దేశిత రైళ్లలో ఎక్కేందుకు  తోపులాటలకు తావివ్వకుండా క్యూలైన్లలో బోగీల వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. 

  • Passenger Crowd Control: పండుగ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్‌లో రాకపోకల్ని క్రమబద్దీకరించడానికి విజయవాడలో క్యూ పద్ధతి ప్రవేశపెట్టారు. ప్రయాణికులు  నిర్దేశిత రైళ్లలో ఎక్కేందుకు  తోపులాటలకు తావివ్వకుండా క్యూలైన్లలో బోగీల వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. 
విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల అవసరాలను తీర్చేలా  కనీస సౌకర్యాలు కల్పించారు, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా విస్తృత శ్రేణి ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని అన్ని టెర్మినల్స్‌లో   లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు, చక్రాల కుర్చీ సౌకర్యాలు ఉన్నాయి.  
(1 / 6)

దక్షిణ మధ్య రైల్వే (SCR)లో సికింద్రాబాద్ తర్వాత NSG-1 హోదా సాధించిన రెండవ స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. ఉత్తమసేవలు, ప్రయాణికుల సంతృప్తితో మెరుగైన ఫలితాలు సాధింాచరు. భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ & తూర్పు భాగాలకు భౌగోళికంగా  వ్యూహాత్మక స్థానంగా విజయవాడ ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకదానితో మరొకటి అనుసంధానానికి  గేట్‌వే‌గా  విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. 
(2 / 6)

 రైళ్లలోని అన్ని రిజర్వ్  కోచ్‌లను పర్యవేక్షించడానికి తగినంత టిక్కెట్ తనిఖీ సిబ్బందిని నియమించారు, టిక్కెట్‌లేని ప్రయాణాన్ని నిరోధించడానికి మరియు నిజాయితీగల ప్రయాణీకుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి ప్రత్యేక టిక్కెట్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.
(3 / 6)

దీపావళి  సెలవుల సీజన్‌లో పండుగ రద్దీకి అనుగుణంగా  విజయవాడ డివిజన్ నుండి 40 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నారు. టిక్కెట్ల వాపసు చేయడం, క్యాన్సిలేషన్‌ సులభతరం చేయడానికి విజయవాడ డివిజన్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో అదనపు UTS & PRS కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల రాకపోకలు సులభతరం చేయడానికి  అన్ని ప్రధాన స్టేషన్లలో టిక్కెట్ తనిఖీ సిబ్బందితో ప్రత్యేక సహాయ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. 
(4 / 6)

ప్రయాణికులు తమ బోగీల్లోకి వెళ్లేందుకు క్యూలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రతి రైలు వద్ద ఆర్‌పిఎఫ్‌ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. 
(5 / 6)

దీపావళి పండుగ నేపథ్యంలో పండుగ ప్రయాణాల రద్దీ నియంత్రణ కోసం విజయవాడలో రైలు ప్రయాణాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు.  పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా   సన్నద్ధమయ్యారు. పండుగ మరియు సెలవుల సమయంలో ప్రయాణికుల అదనపు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను పలు మార్గాల్లో నడుపుతున్నారు. ప్రయాణికుల మధ్య తోపులాట లేకుండా క్యూ పద్ధతి ప్రవేశపెట్టారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి