తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో వర్షాలు

AP TG Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో వర్షాలు

30 October 2024, 10:06 IST

AP Telangana Weather News : ఏపీ, తెలంగాణలో మరో ఐదారు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరికొన్నిచోట్ల మోస్తారు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. 

  • AP Telangana Weather News : ఏపీ, తెలంగాణలో మరో ఐదారు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరికొన్నిచోట్ల మోస్తారు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.మరో ఐదారు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. 
(1 / 6)

దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇది దక్షిణ చతీస్ ఘటన్, ఒడిశా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5. 5 కిమీ ఎత్తులో కొనసాగుతూ... ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుందని పేర్కొంది.  
(2 / 6)

ఇవాళ ఏపీలో (అక్టోబర్ 30) చూస్తే మన్యం,అల్లూరి,కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(3 / 6)

తెలంగాణలో చూస్తే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.  
(4 / 6)

నవంబర్ 4వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.  
(5 / 6)

వాతావరణ శాస్త్ర అంచనాల ప్రకారం… డిసెంబర్ నెలలో గరిష్ట సంఖ్యలో తుపానులు (సుమారు 85%) ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు & పుదుచ్చేరి తీరాల వద్ద దాటుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు నెలలో ఏర్పడే తుపాన్లు 70 శాతం తీవ్ర తుపాన్లుగా బలపడతాయని పేర్కొంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి