తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Farmer Registry : పీఎం కిసాన్ సహా వ్యవసాయ పథకాలు పొందాలా?- ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి, రిజిస్ట్రేషన్ ఇలా

AP Farmer Registry : పీఎం కిసాన్ సహా వ్యవసాయ పథకాలు పొందాలా?- ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి, రిజిస్ట్రేషన్ ఇలా

Updated Feb 14, 2025 04:16 PM IST

AP Farmer Registry : ఏపీలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మొదలైంది. రైతుల పేర్లను రిజిస్ట్రీలో నమోదు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లు నమోదు తప్పనిసరి. ఈ నెల 25వ తేదీలోపు రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల(ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ లబ్ధిదారులను గుర్తించి, పథకాలను వర్తింపజేసేందుకు కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ రిజిస్ట్రీలో ఉన్న వాళ్లకు మాత్రమే పీ‌ఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఇతర వ్యవసాయాధారిత పథకాలు వర్తింప చేయనున్నారు.  
(1 / 7)

రైతుల పేర్లను రిజిస్ట్రీలో నమోదు చేసి విశిష్ట సంఖ్య(యూసీ) జారీ చేస్తున్నారు. ఆధార్ తరహాలో ప్రతి రైతుకు 11 నెంబర్లతో యూనిక్ కోడ్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిది. భూమి ఉన్న ప్రతి రైతు పట్టాదారు పాసుపుస్తకం లేదా 1బి, ఆధార్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసిన మొబైల్ తో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిబ్రవరి 25 తేదీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
(2 / 7)

ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టు భాగంగా వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూయజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను  జారీ చేయనున్నారు. ఏపీలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా. అయితే వెబ్‌ల్యాండ్‌ డేటా ప్రకారం 60 లక్షల మంది రైతులను అధికారికంగా గుర్తించారు.  
(3 / 7)

ఫిబ్రవరి 25వ తేదీలోగా 25 లక్షల మందికి, మార్చి 25వ తేదీలోగా మిగిలిన 35 లక్షల మందికి ఫార్మర్‌ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టారు. ముందుగా పీఎం కిసాన్‌ లబ్దిదారులకు ఫార్మర్‌ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి జారీ చేయనున్నారు.  
(4 / 7)

యూనిక్ ఐడీ పొందిన రైతులు ఆయా సీజన్‌లో పొందే సబ్సిడీలు, పంట రుణాలు, బీమా వంటి పథకాలను పొందేందుకు అర్హులు. ఫార్మర్‌ రిజిస్ట్రీని యూనిఫైడ్‌ ల్యాండ్‌ ఏపీఐ, ఆధార్‌ బేస్డ్‌ అథంటికేషన్, పీఏం కిసాన్‌ వంటి డిజిటల్‌ అగ్రికల్చర్‌ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానం చేయనున్నారు. ఈ ఐడీని ఉపయోగించి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా ఆర్థిక సేవలను పొందవచ్చు.  
(5 / 7)

ఫార్మర్ రిజిస్ట్రీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో అగ్రికల్చర్ అధికారులను సంప్రదించవచ్చు. లేదా ఏపీఎఫ్‌ఆర్‌అగ్రిస్టాక్‌ (ఏపీ ఫార్మర్‌ రిజిస్ట్రీ) https://apfr.agristack.gov.in/farmer-registry-ap/#/  అనే వెబ్‌సైట్‌లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్రు. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి రైతు ఆధార్‌ నెంబర్‌ నమోదు చేయాలి. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత రైతు మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. మరోసారి ఓటీపీ వస్తుంది. ఇలా రెండు సార్లు చేసిన తర్వాత రైతు వివరాలు డిస్‌ప్లే అవుతాయి. 
(6 / 7)

అనంతరం రైతుకు గ్రామంలో పొలం ఉంటే వాటి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఆ సర్వే నెంబర్లను సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేయగానే, మరోసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాత రైతుకు 11 సంఖ్యల ఫార్మర్‌ రిజిస్ట్రీ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది. ఆ నెంబర్‌ రైతు మొబైల్‌కు వస్తుంది. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి