తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru News: బెంగళూరులో పోలీసులపై యువతి వీరంగం; కాలర్ పట్టుకుని, కాలితో తన్నుతూ, బూతు పురాణం

Bengaluru news: బెంగళూరులో పోలీసులపై యువతి వీరంగం; కాలర్ పట్టుకుని, కాలితో తన్నుతూ, బూతు పురాణం

Sudarshan V HT Telugu

25 October 2024, 18:49 IST

google News
  • Bengaluru news: పోలీసులపై ఒక యువతి కేకలు వేస్తూ, కాలితో తన్నుతూ న్యూసెన్స్ సృష్టించిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి రోడ్డు పక్కన  ఉన్న పోలీసులను తన్నుతూ, కేకలు వేయడం, ఒక పోలీసు బాడీ కెమెరాను లాగేందుకు ప్రయత్నించడం కనిపించింది.

బెంగళూరులో పోలీసులపై యువతి వీరంగం
బెంగళూరులో పోలీసులపై యువతి వీరంగం (X)

బెంగళూరులో పోలీసులపై యువతి వీరంగం

Bengaluru crime news: బెంగళూరులోని ఇందిరానగర్ లో ఈఎస్ ఐ ఆస్పత్రి జంక్షన్ సమీపంలో సోనమ్ అనే ఓ యువతి ట్రాఫిక్ పోలీసు అధికారితో ఘర్షణకు దిగింది. రోడ్డుపై గట్టిగా అరుస్తూ, అక్కడ ఉన్న పోలీసుల ఉద్యోగాలు తీసేయిస్తానని హిందీలో గట్టిగా అరుస్తూ, ఒక పోలీసు వద్ద నుంచి బాడీ కెమెరాను లాగడానికి ప్రయత్నించింది. రోడ్డుపై ఆమె న్యూసెన్స్ సృష్టిస్తుప్పటికీ, పోలీసులు అసలు స్పందించకపోవడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.

కేసు నమోదు, అరెస్ట్

ఆ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం స్పందించింది. ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు ధృవీకరించింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోషల్ మీడియా సైట్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ ఘటన ఆన్ లైన్ లో సంచలనం సృష్టించింది. ఈ ఘర్షణకు దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులు ఇప్పటికీ తెలియదు. ఆమె ఎందుకలా ప్రవర్తించింది? మద్యం మత్తులో ఉందా? డ్రగ్స్ తీసుకుని ఉంటుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆమె అంతగా అరుస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించలేదు? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని తెలుస్తోంది.

ఎక్స్ యూజర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు?

ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై ఎక్స్ యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ యువతి అంతగా గొడవ చేస్తున్నా.. పోలీసులు ప్రశాంతంగా వ్యవహరించడంపై ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘ అదే ఆ యువతి కన్నడంలో ఇలా అరుస్తూ ఉంటే పోలీసులు మరోలా స్పందించేవారు’ అని కామెంట్ చేశాడు. అలాగే, గతంలో జరిగిన ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తే, ఆ వీడియో కూడా వైరల్ అయింది.

విషయం తెలియకుండా మాట్లాడొద్దు

సందర్భం తెలియకుండా స్పందించవద్దని, ఈ విషయాన్ని పోలీసులకే వదిలేయడం మంచిదని దినేష్ అనే మరో యూజర్ ఎక్స్ లో అని కామెంట్ చేశాడు. ‘‘యూనిఫాంలో ఉన్న ఓ పోలీసు అధికారిని ప్రజలు కాలర్ పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మన పోలీసులు మేల్కొంటారని ఆశిస్తున్నాను’’ అని మరో యూజర్ స్పందించాడు.

మరో ఘటనలో..

కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం సాధారణ తనిఖీల కోసం వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసును కారుతో పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో కేబుల్ ఆపరేటర్ మిథున్ జగ్దాలే అనే నిందితుడిగా గుర్తించారు. అతడు కారును ఆపకుండా అతివేగంగా నడుపుతూ వెళ్తుండగా, ఆ కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కాన్ స్టేబుల్ ను కారుతో పాటు లాక్కెళ్లిపోయాడు. కారు బానెట్ పై కానిస్టేబుల్ గట్టిగా అతుక్కుని ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శివమొగ్గలో..

శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ మిథున్ తెలిపిన వివరాల ప్రకారం, సహ్యాద్రి కళాశాల ముందు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రావతి నుంచి వస్తున్న కారును ఆపాలని అధికారులు సైగ చేశారు. డ్రైవర్ వేగంగా వెళ్లి అధికారిని 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. భద్రావతి నుంచి వస్తున్న కారును ఆపమని ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ ఇవ్వడంతో డ్రైవర్ సిబ్బంది వైపు వేగంగా దూసుకెళ్లాడని శివమొగ్గ ఎస్పీ మిథున్ తెలిపారు.

తదుపరి వ్యాసం