Pune gang rape: యువతిపై గ్యాంగ్ రేప్; యాక్టివిస్ట్ లమని చెప్పి దారుణం; ఆమె స్నేహితుడిపై దాడి
Published Oct 04, 2024 02:24 PM IST
Pune gang rape: ఒక యువతిపై ముగ్గురు దుండగులు గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన ఘటన పుణెలో చోటు చేసుకుంది. ఆ యువతి తన స్నేహితుడితో కలిసి బోప్ దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ ఈ దారుణం జరిగింది. ఆమె స్నేహితుడిపై దాడికి పాల్పడి, ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు.
యువతిపై గ్యాంగ్ రేప్
పుణె శివార్లలో 21 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బోప్ దేవ్ ఘర్ ప్రాంతంలో ఈ సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన స్నేహితుడితో కలిసి గురువారం రాత్రి సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లింది.
మానవ హక్కుల కార్యకర్తలమని చెప్పి..
కొంధ్వా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి బాధితురాలు, ఆమె స్నేహితుడు బోప్ దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి, తాము మానవ హక్కుల కార్యకర్తలమని చెప్పి, ఈ ప్రాంతానికి జంటలు రాకూడదని వారిని బెదిరించారు. ఆ తరువాత, ఆ యువతి స్నేహితుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ యువతిని బలవంతంగా కార్లో ఎక్కించుకుని కొంత దూరం తీసుకువెళ్లి, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని చిత్ర హింసలు పెట్టారు. ఆ యువతి శరీరంపై పలు గాయాలున్నాయని పుణె సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఒకరి అరెస్ట్
ఆ యువతి, ఆమె స్నేహితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్యాంగ్ రేప్ వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఆరేళ్ల బాలికలపై లైంగిక దాడి
మరో ఘటనలో.. ఇద్దరు ఆరేళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్కూల్ వ్యాన్ డ్రైవర్ ను పుణె పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 30న నగరంలోని వాన్ వాడి ప్రాంతంలో బాలికలు పాఠశాలకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా వ్యాన్ లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వ్యాన్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వ్యాన్ లో ఆ ఇద్దరు అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ ను తాకాడు. అనంతరం ఓ విద్యార్థిని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 64 (అత్యాచారానికి శిక్ష), 65 (2) (పన్నెండేళ్ల లోపు మహిళపై అత్యాచారానికి శిక్ష), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (pocso) చట్టం కింద నిందితుడైన 45 ఏళ్ల సంజయ్ రెడ్డిపై బుధవారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని, అత్యాచారం, ఇతర నేరాలకు బీఎన్ఎస్, పోక్సో కింద సంబంధిత సెక్షన్లను ప్రయోగించామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విలేకరులతో చెప్పారు. పాఠశాల అధికారులను విచారణకు పిలిపించామని, వారు కూడా తప్పు చేశారో లేదో పరిశీలిస్తామని చెప్పారు.
టాపిక్