Pakistan threatens nuclear war : ‘మా దగ్గర ఆటం బాంబు ఉంది’- భారత్‌కు పాక్ హెచ్చరిక!
18 December 2022, 6:48 IST
Pakistan threatens nuclear war : ‘మా దగ్గర ఆటం బాంబు ఉంది,’ అంటూ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు పాకిస్థానీ నేత. బిలావల్ భుట్టో వ్యవహారం నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌కు పాక్ హెచ్చరికలు
Pakistan threatens nuclear war : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. బిలావల్‌పై భారతీయులు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా.. ఆయనకు పాకిస్థానీలు మద్దతుగా నిలిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత షాజియా మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఆటం బాంబు ఉందని, ఇండియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు!
"పాకిస్థాన్ దగ్గర ఆటం బాంబు ఉందన్న విషయాన్ని ఇండియా మార్చిపోకూడదు. మోదీ ప్రభుత్వం పోరాటం చేస్తే.. అందుకు తగ్గట్టుగానే జవాబు చెబుతాము. పాకిస్థాన్ వద్ద అణ్వాయుధ శక్తి ఉంది. మేము నిశ్శబ్ధంగా ఉండము. ఏ విధంగా జవాబు చెప్పాలో పాకిస్థాన్‌కు తెలుసు. పాకిస్థాన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తే.. మేము నిశ్శబ్ధంగా ఉండలేము," అని ఓ మీడియా సమావేశంలో హెచ్చరికలు చేశారు షాజియా మేరీ.
బిలావల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Bilawal Bhutto comment on Modi : యూఎన్ వేదికగా పాకిస్థాన్‌పై ఇటీవలే తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారత వీదేశాంగశాఖ మంత్రి జైశంకర్. ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇతరులను బాధపెట్టే చర్యలను మానుకుని, పొరుగు దేశాలతో మంచిగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఇండియా ప్రేరేపిస్తోందని ఓ పాక్ జర్నలిస్ట్ ఆరోపించిన నేపథ్యంలో జైశంకర్ ఈ విధంగా స్పందించారు.
"ఈ ప్రశ్నని మీరు తప్పుడు మంత్రిని అడుగుతున్నారు. మీరు అడగాల్సింది పాకిస్థాన్ మంత్రిని. ఇంకెంత కాలం ఉగ్రవాదాన్ని వ్యాపింప చేస్తారో పాకిస్థాన్ మంత్రులే చెప్పాలి. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన దేశం మీది," అని అన్నారు.
Bilawal Bhutto Modi comments : మరోవైపు.. యూఎన్ వేదికగా పాకిస్థాన్ విదేశాంగమంత్రి సైతం భారత్‌పై మండిపడ్డారు. ఈ క్రమంలోనే మోదీ, ఆర్ఎస్ఎస్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
"మీకో విషయం చెప్పాలి. ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోయాడు. కానీ 'బుచ్చర్ ఆఫ్ గుజరాత్' బతికే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇండియాకు ప్రధాని కూడా అయ్యారు. ఈ ప్రధాని ఆర్ఎస్ఎస్ మనిషి. ఈ విదేశాంగమంత్రి ఆర్ఎస్ఎస్ మనిషి. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? హిట్లర్ నుంచి స్ఫూర్తిపొందిందే ఈ ఆర్ఎస్ఎస్," అని వ్యాఖ్యలు చేశారు బిలావల్ భుట్టో.
India Pakistan nuclear war : పాక్ విదేశాంగమంత్రి వ్యాఖ్యలను ఇండియా తిప్పికొట్టింది. ‘పాకిస్థాన్ మరింత దిగజారిపోయింది’ అని విమర్శించింది. బిలావల్ భుట్టో మాటలకు వ్యతిరేకంగా ఇండియాలో నిరసనలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది బీజేపీ. ఆయన దిష్టిబొమ్మలను తగలబెట్టింది.