తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Elections: బ్లూ, రెడ్​, స్వింగ్​ స్టేట్స్​ అంటే ఏంటి? ప్రస్తుతం ట్రెండ్​ ఎలా ఉంది?

US Elections: బ్లూ, రెడ్​, స్వింగ్​ స్టేట్స్​ అంటే ఏంటి? ప్రస్తుతం ట్రెండ్​ ఎలా ఉంది?

Sharath Chitturi HT Telugu

02 November 2024, 11:15 IST

google News
  • US Elections 2024: అమెరికాలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపించే పేర్లు.. బ్లూ, రెడ్​, స్వింగ్​ స్టేట్స్. అసలు ఏంటి ఇవి? ప్రస్తుతం ట్రెండ్​ ఎలా ఉంది? ఎక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ తెలుసుకోండి..

ఇంకొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..
ఇంకొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. (REUTERS)

ఇంకొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అడుగు దూరంలో ఉన్నాయి. నవంబర్​ 5న అమెరికా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అమెరికాలో ‘బ్లూ స్టేట్స్​’, ‘రెడ్​ స్టేట్స్​’, ‘స్వింగ్​ స్టేట్స్​’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి అర్థాలేంటి? వేటిని బ్లూ స్టేట్స్​గా- వేటిని రెడ్​ స్టేట్స్​గా పిలుస్తారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బ్లూ- రెడ్​- స్వింగ్​ స్టేట్స్​ అంటే ఏమిటి?

అమెరికాలో "బ్లూ స్టేట్స్​" అనేవి ప్రధానంగా డెమొక్రటిక్ అభ్యర్థులకు ఓటు వేస్తుంటాయి. "రెడ్​ స్టేట్స్​" రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. 2000 అధ్యక్ష ఎన్నికల సమయంలో టెలివిజన్ నెట్​వర్క్​లు ఎన్నికల ఫలితాలను సూచించడానికి కలర్-కోడెడ్​ మ్యాప్​లను ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుంచి ఇది కొనసాగుతోంది.

బ్లూ స్టేట్స్: కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాలను బ్లూ స్టేట్స్​గా భావిస్తారు. ఈ రాష్ట్రాలు ప్రగతిశీల విధానాలకు మద్దతు ఇస్తాయి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తాయి. తరచుగా వారి రాజకీయ ఎజెండాలను నడిపించే అర్బన్​ సెంటర్స్​ని కలిగి ఉంటాయి.

రెడ్ స్టేట్స్: టెక్సాస్, అలబామా, వ్యోమింగ్ వంటి రాష్ట్రాలను రెడ్​ స్టేట్స్​గా వర్గీకరించడం జరిగింది. ఈ ప్రాంతాలు తరచుగా సంప్రదాయవాద విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛలు, పరిమిత ప్రభుత్వ జోక్యానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇవి వారి ప్రధానంగా గ్రామీణ, శివారు జనాభా ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.

స్వింగ్​ స్టేట్స్​:- ఆరిజోనా, జార్జియా, మిషిగాన్​, నెవాడా, నార్త్​ కారోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిల్​. ఈ రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓటు వేస్తారన్నది నిత్యం ఉత్కంఠే! అభ్యర్థుల గెలుపోటములు వీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

ఇటీవలి ఎన్నికల్లో ఓటింగ్ ట్రెండ్స్..

2020 నవంబర్​లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బ్లూ, రెడ్​ రాష్ట్రాల మధ్య విభజన స్పష్టంగా కనిపించింది. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకోగా, గణనీయమైన సంఖ్యలో బ్లూ స్టేట్స్​కి చెందినవారు ఉన్నారు. గతంలో రెడ్​లోకి మారిన మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు బ్లూ రంగులోకి మారడం.. మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి అద్దం పడుతోంది.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్​కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ప్రధానంగా దక్షిణ, మిడ్ వెస్ట్​లోని రెడ్ రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోరిడా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాలు యుద్ధభూమిగా మిగిలిపోయాయి! ఇక్కడ సాంప్రదాయకంగా రెడ్​ స్టేట్స్​ మారుతున్న జనాభా, మారుతున్న రాజకీయ మనోభావాల సంకేతాలను చూపించాయి.

తాజా ట్రెండ్స్..

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్దీ బ్లూ అండ్​ రెడ్​ డైనమిక్​ను మార్చే ట్రెండ్స్​ని విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు. ఆర్థిక పునరుద్ధరణ, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు వంటి అంశాలు ఓటర్ల మదిలో ముందంజలో ఉన్నాయి. అదనంగా, శివారు ప్రాంతాలలో యువ ఓటర్లు, వైవిధ్యమైన జనాభా ఫలితాలను ప్రభావితం చేస్తున్నారు. చాలా మంది విశ్లేషకులు కొన్ని రెడ్​ స్టేట్స్​ పునర్వ్యవస్థీకరణను సూచిస్తున్నారు.

2020 ఎన్నికల్లో బ్లూలోకి మారిన అరిజోనా, జార్జియా వంటి రాష్ట్రాలు తదుపరి అధ్యక్షుడిని నిర్ణయించడంలో కీలకంగా కొనసాగవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా, కొన్ని బ్లూ స్టేట్స్​ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నేరాలు, పన్నులు, గృహనిర్మాణ స్థోమత గురించి పెరుగుతున్న చర్చలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం