తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

Sharath Chitturi HT Telugu

04 November 2024, 6:43 IST

google News
  • US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధం! నవంబర్​ 5న జరిగే ఎన్నికలకు ముందు ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అమెరికా అధ్యక్ష ఎన్నికల వివరాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల వివరాలు.. (Bloomberg)

అమెరికా అధ్యక్ష ఎన్నికల వివరాలు..

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్​ 5న జరిగే ఈ ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడొక హాట్​ టాపిక్​. కమలా హారిస్​ వర్సెస్​ డొనాల్డ్​ ట్రంప్​ మధ్య రసవత్తర పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలకు ముందు మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలను ఇక్కడ చూసేయండి..

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు..

అమెరికాలో హౌస్​ ఆఫ్​ రిప్రెసెంటేటివ్స్​లో 435 సీట్లకు నవంబర్​ 5న ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు, అధ్యక్ష అభ్యర్థి రిప్రెసెంటేటివ్స్​గా భావించే ఎలక్టార్స్​ని (538) ఎన్నుకుంటారు. ఈ ఎలక్టార్ల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా (జనాభా ఆధారంగా) ఉంటుంది. ఎక్కువ మంది ఎలక్టార్స్​ గెలిచిన అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఎలక్టార్స్​ సమావేశమవుతారు. దీన్ని ఎలక్టోరల్​ కాలేజ్​ అంటారు. ఆ సమావేశంలో వారు తమ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

ప్రస్తుతం 435 సీట్లున్న హౌస్​ ఆఫ్​ రిప్రెసెంటేటివ్స్​లో మెజారిటీ మార్క్​ 270. ఎన్నికల రోజున అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రాష్ట్రాలను కలుపుకుంటే 270 మార్క్​ దాటిపోతుంది. అందుకే, ఎన్నికలు జరిగే నవంబర్​ 5నే గెలిచింది ఎవరు? అన్నది స్పష్టమైపోతుంది!

అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరు?
అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ తో తలపడుతున్నారు. థర్డ్​ పార్టీలు లేదా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్న కొందరు అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థిగా రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు చేజ్ ఒలివర్ ఓవల్ కార్యాలయానికి పోటీ చేస్తుండగా, గ్రీన్ పార్టీ వైద్యుడు జిల్ స్టెయిన్​ను రెండోసారి బరిలోకి దింపింది. రాజకీయ కార్యకర్త, తత్వవేత్త, విద్యావేత్త కార్నెల్ వెస్ట్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?
యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యాబ్ ట్రాకర్ డేటా ప్రకారం.. 68 మిలియన్లకు పైగా అమెరికన్లు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెయిల్-ఇన్ బ్యాలెట్లు లేదా వ్యక్తిగత పోలింగ్ సైట్లు వంటి ముందస్తు ఓటింగ్ ఆప్షన్స్​ని ఉపయోగించారు. నవంబర్ 5న వైట్​హౌస్​ కోసం అత్యంత రసవత్తరంగా జరిగే రేసులో తమ వంతు పాత్ర పోషించేందుకు లక్షలాది మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి లొకేషన్, టైమ్ జోన్​ను బట్టి వేర్వేరు సమయాల్లో బ్యాలెట్లు ఓపెన్​ అవుతాయి.

తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారు?
ఒపీనియన్ పోల్స్ చారిత్రాత్మకంగా నెక్​ టు నెక్​ రేస్​ని చూపిస్తున్నాయి. ఆదివారం ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ / సియానా కాలేజ్ పోల్.. మంగళవారం ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉన్న ఏడు రాష్ట్రాల్లో కమలా హారిస్, ట్రంప్ మధ్య రసవత్తర పోరును చూపించింది. గత రెండు ఎన్నికల్లో ట్రంప్ సునాయాసంగా గెలిచిన అయోవాలో కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. అయితే ఆ రాష్ట్రంలో ఆమె వెనుకంజలో ఉన్నట్లు మరో సర్వేలో తేలింది.

తదుపరి వ్యాసం