తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా? భారత్ నుంచి కూడా ఓటు వేయొచ్చు

US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా? భారత్ నుంచి కూడా ఓటు వేయొచ్చు

Sudarshan V HT Telugu

05 November 2024, 16:53 IST

google News
  • US Election 2024: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అగ్రదేశం మరో కొత్త ప్రెసెడెంట్ ను ఎన్నుకోబోతోంది. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మన భారతదేశంలో ఎన్నికల తరహాలో ప్రత్యక్ష ఎన్నికలుగా ఉండదు. ఓటర్లు ముందుగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ

US Election 2024: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అమెరికన్లు మంగళవారం ఓటు వేస్తున్నారు. పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని అధికారులు ఓటర్లను కోరారు. కాగా, ఈ ఎన్నికల తుది ఫలితాలు వెలువడడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ (donald trump), డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమల హ్యారిస్ (kamala harris) పోటీ పడుతున్నారు.

ఎలక్టోరల్ కాలేజీ..

భారతదేశం వలె కాకుండా, అమెరికా వ్యవస్థలో, పౌరులు తమ నాయకుడికి నేరుగా ఓటు వేయరు. బదులుగా, వారు ముందుగా తమ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుడిని ఎన్నుకుంటారు. అమెరికాలో మొత్తం 538 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులుంటారు. ఎన్నికైన ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల సంఖ్య ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది.

నవంబర్ తొలి మంగళవారం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరుగుతాయి. నాలుగో సంవత్సరం నవంబర్ తొలి మంగళవారం ఈ ఎన్నిక ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ లో తొలి మంగళవారం నవంబర్ 5వ తేదీన వస్తోంది. కాగా, ఇప్పటికే మిలియన్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో జార్జియా, నార్త్ కరోలినా, ఇతర బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ఉన్నారు.

భారత్ నుంచి కూడా ఓటు వేయొచ్చు..

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ప్రజలు 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (us presidential elections 2024) ఓటు వేయొచ్చు. అందుకు ముందుగా వారు ఆబ్సెంటీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఆ తరువాత, తాము ఉన్న దేశం నుంచి బ్యాలెట్ పేపర్ ఓట్లను ఈ-మెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపించి ఓటు వేయవచ్చు.

యుఎస్ పోల్స్ కోసం ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి?

విదేశాల్లోని అమెరికన్ ఓటర్లు ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి vote.gov సందర్శించాలి. ఆ తరువాత, ఆ అమెరికన్ ఓటరు తాను ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఓటరు నమోదుకు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు, నియమాలు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలో సంబంధిత వెబ్ సైట్ లో సూచనలు కనిపిస్తాయి. నేషనల్ మెయిల్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారమ్ ను ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో ఫిల్ చేయడం ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఫిల్ చేసి, సంబంధిత డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి పంపించవచ్చు. లేదా, ఆ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, అన్ని వివరాలు నింపి, పోస్ట్ లో పంపించవచ్చు.

ఓటు వేయడానికి ఎలాంటి డాక్యుమెంట్లు నమోదు చేసుకోవాలి?

చాలా సందర్భాలలో, అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడానికి నమోదు చేసుకోవడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా స్టేట్ ఐడి అవసరం ఉంటుంది. మీ వద్ద ఈ రెండూ లేకపోతే, మీరు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా యుటిలిటీ బిల్లుతో సహా ఇతర రకాల డాక్యుమెంటేషన్లను అందించవచ్చు. అయితే, మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా అమెరికా రాష్ట్రంలో ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ముగిశాక పాపులర్ ఓటు విజేతను ప్రకటిస్తారు.

తదుపరి వ్యాసం