తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా కమిటీ తుది ముద్ర, త్వరలో సీఎం ధామికి నివేదిక

యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా కమిటీ తుది ముద్ర, త్వరలో సీఎం ధామికి నివేదిక

HT Telugu Desk HT Telugu

09 October 2024, 9:05 IST

google News
  • ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ రూల్స్ కమిటీ చైర్మన్ శత్రుఘ్న సింగ్ ఏఎన్ఐతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, యూసీసీ నిబంధనలపై కమిటీ తన తుది ముద్ర వేసిందని, రాబోయే వారం లేదా పది రోజుల్లో, కమిటీ దానిని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అందజేస్తుందని చెప్పారు.

ఉత్తరాఖండ్ లో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు కసరత్తు
ఉత్తరాఖండ్ లో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు కసరత్తు

ఉత్తరాఖండ్ లో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు కసరత్తు

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), అక్టోబరు 9: ఉమ్మడి పౌరస్మృతి నిబంధనలపై కమిటీ తుది ఆమోదం పొందిన తర్వాత ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు మార్గం సుగమమైంది. ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ రూల్స్ కమిటీ చైర్మన్ శత్రుఘ్న సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, యూసీసీ నిబంధనలపై కమిటీ తన తుది ముద్ర వేసిందని, రాబోయే వారం లేదా పది రోజుల్లో, కమిటీ దానిని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అందజేస్తుందని చెప్పారు.

ఎనిమిది నెలల క్రితం యూసీసీ కోడ్‌ను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని, ఆ తర్వాత నిబంధనల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేశామని యూసీసీ రూల్స్ కమిటీ చైర్మన్ తెలిపారు. ఈ కమిటీ మొదటి సమావేశం ఫిబ్రవరి చివరి వారంలో జరిగింది. ఇప్పుడు తుది సమావేశంలో యుసీసీ నిబంధనలకు ఆమోదం లభించింది.

ప్రజాప్రయోజనాల దృష్ట్యా యూసీసీ కోడ్ ను రూపొందించినట్లు సింగ్ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే యూసీసీ వెబ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

అంతకుముందు సెప్టెంబర్ లో ఉత్తరాఖండ్ యూసీసీ నిబంధనల రూపకల్పనకు సంబంధించి బీజాపూర్ అతిథి గృహంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రతురి, యూసీసీ కమిటీ సభ్యుడు శత్రుఘ్న సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.

హోం, పోలీస్, హెల్త్, ఎక్సైజ్, మైనారిటీ, కల్చర్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, ఎనర్జీ, ప్లానింగ్, ఫైనాన్స్ శాఖల సహకారం, సమన్వయంతో ఉత్తరాఖండ్ యూసీసీ నిబంధనల రూపకల్పనకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

యూసీసీ అమలుకు చేయాల్సిన నిబంధనలను ఖరారు చేయడంలో అన్ని శాఖలు సహకరించాలని, సమన్వయం చేసుకోవాలని రాధా రతురి, శత్రుఘ్న సింగ్ ఆదేశించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టగా, మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 7న భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. (ఏఎన్ఐ)

టాపిక్

తదుపరి వ్యాసం