Predictions of US election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతపై హిప్పో మూ డెంగ్ అంచనా
05 November 2024, 20:19 IST
US elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్, డెమొక్రాటిక్ అభ్యర్థులు ట్రంప్, కమల హ్యారిస్ లు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలిచి, విజేతగా వైట్ హౌజ్ లో ఎవరు అడుగుపెడ్తారనే విషయంలో అనేక అంచనాలు వెలువడ్డాయి. అందులో టాప్ 5 ప్రెడిక్షన్స్ మీ కోసం..
కమలా హ్యారిస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్
US elections: కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం అమెరికన్లు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరుతున్నారు. మరోవైపు, వైట్ హౌస్ రేసులో ఎవరు గెలుస్తారనే దానిపై అనేక అంచనాలు వెలువడ్డాయి. కొందరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపగా, మరికొందరు భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ఎడ్జ్ ఇచ్చారు.
టాప్ 5 అంచనాలు ఇవే..
మూ డెంగ్ అంచనా
ఇంటర్నెట్ కు ఇష్టమైన హిప్పో, వైరల్ సెన్సేషన్ మూ డెంగ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తనదైన శైలిలో అంచనా వేసింది. థాయ్ లాండ్ కు చెందిన పిగ్మీ హిప్పో ముందు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు చెక్కి ఉన్న రెండు పుచ్చకాయలను పెట్టారు. వాటిలో ఆ హిప్పో కాసేపు ఆలోచించి ట్రంప్ (donald trump) పేరు ఉన్న పుచ్చకాయను ఎంచుకుంది.
చాట్ జీపీటీ ఏఐ నోస్ట్రడామస్
ఎక్కువ మంది తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి కృత్రిమ మేధ (artificial intelligence) ను ఉపయోగిస్తుండటంతో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి సన్ అమెరికా కూడా ఏఐ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. అయితే, అది ఇచ్చిన సమాధానం చాలా మందిని అయోమయానికి గురిచేసింది. ఈ ఎన్నికల్లో ట్రంప్ గానీ, కమలా హారిస్ (kamala harris) గానీ విజయం సాధించరని, చివరి గంటలో ఊహించని ట్విస్ట్ తో ఊహించని వ్యక్తి రంగంలోకి వస్తారని ఏఐ అంచనా వేసింది. ట్రంప్, కమల హ్యారిస్ పూర్తి శక్తితో పోరాడినా, చివరి నిమిషంలో మరొకరు నాయకత్వ స్థానంలోకి వస్తారని, రాత్రికి రాత్రే ఆ వ్యక్తి బయటకు వస్తారని ఏఐ జోస్యం చెప్పింది.
ఆన్లైన్ ఒరాకిల్
జనవరి 6 క్యాపిటల్ అల్లర్ల సంఘటనలను ప్రతిధ్వనిస్తూ 2024 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించినప్పుడు అశాంతి, నిరసనలు ఉంటాయని ఆన్లైన్ ఒరాకిల్ అంచనా వేసింది. శాంతికి విఘాతం కలిగించేలా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని పేర్కొంది.
అలెన్ లిచ్ట్ మన్ వర్సెస్ నేట్ సిల్వర్
వైట్ హౌస్ రేసులో ఎవరు గెలుస్తారనే దానిపై అలెన్ లిచ్ట్ మన్, నేట్ సిల్వర్ లు తమ అంచనాలను వెలిబుచ్చారు. విజయావకాశాలు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారనే తన మనస్సాక్షి చెబుతోందని సిల్వర్ అన్నారు. కాగా, గత తొమ్మిది అధ్యక్ష ఎన్నికల ఫలితాలను పక్కాగా అంచనా వేసిన అమెరికన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ లిచ్ట్ మన్ మాత్రం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని ప్రకటించారు.
సింప్సన్స్
టీవీ షో ది సింప్సన్స్ తరచుగా ముఖ్యమైన సంఘటనలను ఖచ్చితంగా, స్పష్టంగా అంచనా వేసిన ఘనతను కలిగి ఉంది. యుఎస్ అధ్యక్ష రేసుకు సంబంధించి తాజా ఎపిసోడ్ లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలుస్తారని అంచనా వేసింది. ఈ షోను హోస్ట్ చేసిన లీసా కమల హ్యారిస్ తరహాలో దుస్తులు ధరించారు. పర్పుల్ సూట్, ముత్యాల చెవిపోగులు, నెక్లెస్ తో ఆమె అచ్చం ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలి లాగానే కనిపించారు.