తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court : ‘న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? ఒప్పుకోము’- సుప్రీంకోర్టు!

Supreme Court : ‘న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? ఒప్పుకోము’- సుప్రీంకోర్టు!

Sharath Chitturi HT Telugu

22 October 2024, 11:31 IST

google News
    • Supreme Court on lawyers : న్యాయవాది జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ఓ లాయర్​, ఫ్రీలాన్స్​ జర్నలిజం చేస్తుండటాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు బార్​ కౌన్సిల్​కి నోటీసులు ఇచ్చింది.
సుప్రీంకోర్టు..
సుప్రీంకోర్టు.. (HT_PRINT)

సుప్రీంకోర్టు..

లా ప్రాక్టీస్​ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా ఓ న్యాయవాది- ఫ్రీలాన్స్​ జర్నలిజం చేస్తున్నాడని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై స్పందించాలని బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాకు నోటీసులు సైతం ఇచ్చింది.

‘లా చేస్తూ జర్నలిస్ట్​గా ఉండకూడదు..!’

బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్​ భూషణ్​ శరణ్​పై న్యాయవాది మహ్మద్​ కమ్రాన్​ వేసిన పిటిషన్​పై జస్టిస్​ అభయ్​ ఎస్​ ఓక, జస్టిస్​ ఏజీ మసిహ్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా, న్యాయవాది కమ్రాన్​- ఒక ఫ్రీలాన్స్​ జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నట్టు ధర్మాసనానికి తెలిసింది. దీనిని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

బార్​ కౌన్సిల్​ రూల్స్​ ప్రకారం.. లాయర్​గా ప్రక్టీస్​ చేస్తున్న వారు ఇతర వృత్తుల్లో ఉండకూడదు!

ఇదీ చూడండి:- Indian workers : భారతీయ ఉద్యోగులకు ఈ దేశంలో భారీ డిమాండ్​- వెళితే జీవితం మారిపోతుంది!

"లాయర్​ అయినా అవ్వాలి లేదా జర్నలిస్ట్​ అయినా అవ్వాలి. ద్వంద్వ పాత్రలను ఒప్పుకోము. ఇది ఎంతో గొప్ప వృత్తి. ఫ్రీలాన్స్​ జర్నలిస్ట్​ అని అతను చెప్పుకోకూడదు," అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే, సుప్రీంకోర్టు కమ్రాన్​పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు! లాయర్​గా ప్రాక్టీస్​ చేస్తున్న కమ్రాన్​ ఫ్రీలాన్స్​ జర్నలిజం చేస్తుండటంపై బార్​ కౌన్సిల్​తో పాటు యూపీ బార్​ కౌన్సిల్​కి సుప్రీంకోర్టు పలు ఆదేశాలిచ్చింది.

తదుపరి వ్యాసం