Study abroad : అమెరికాకు స్టడీ వీసా దొరకడం లేదా? జపాన్‌లో మీ కలల్ని సాకారం చేసుకోండి..
27 October 2024, 9:00 IST
- Study in Japan : విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటున్నారా? అయితే అమెరికా, కెనడాకు ప్రత్యమ్నాయంగా శరవేగంగా ఎదుగుతున్న జపాన్ యూనివర్సిటీల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
అమెరికాకు ప్రత్యమ్నాయంగా ఎదుగుతున్న జపాన్..
ఇటీవలి కాలంలో చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా అమెరికా, కెనడాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ కారణంగానే ఆయా దేశాల్లో స్టడీ వీసాలు సంపాదించుకోవడం మరింత కష్టగా మారిపోయింది. స్టడీ వీసా దొరక్క ఇబ్బందిపడుతున్న వారిలో మీరూ ఉన్నారా? మీ కల్నల్ని విరమించుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా, కెనడాలకు పోటీగా, ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న జపాన్‌లో మీరు చదువుకోవచ్చు. జపాన్‌లో ప్రముఖ విశ్వవిద్యాలయాల గురించి ఇక్కడ తెలుసుకోండి..
జపాన్: ఎమర్జింగ్ స్టడీ డెస్టినేషన్..
ఇటీవల విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం అమెరికా, కెనడాకు ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాలు సమానంగా ఎదుగుతున్నాయి. వాటిల్లో జపాన్ ఒకటి.
సాటిలేని స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) విద్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జపాన్, దాని సామీప్యత కోసం మాత్రమే కాకుండా, దేశ వీసా విధానాల సరళత కారణంగా ముఖ్యంగా భారతదేశం నుంచి విద్యార్థులకు అగ్ర గమ్యస్థానాలలో ఒకటిగా మారుతోంది.
"భారతదేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు, గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు (గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాలలోపు) పర్యాటకం ఉద్దేశ్యంతో స్వల్పకాలిక బస కోసం సింగిల్ ఎంట్రీ వీసా దరఖాస్తులో ఆర్థిక సామర్థ్యాన్ని ధృవీకరించడానికి డాక్యుమెంట్‌కి బదులుగా విద్యార్థి స్థితి లేదా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌ని సమర్పించడానికి అనుమతిస్తున్నాము," అని భారతదేశంలోని జపాన్ రాయబార కార్యాలయం అధికారిక వెబ్సైట్ చెబుతోంది.
జపాన్‌లో కొన్ని ఉత్తమ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం జపాన్‌లోని టాప్ యూనివర్శిటీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
టోక్యో విశ్వవిద్యాలయం..
మొత్తం 83.3 స్కోరు సాధించి ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2024లో 28వ స్థానంలో నిలిచింది. 1877 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు విద్యా విభాగాలలో కోర్సులను అందిస్తుంది.
క్యోటో యూనివర్శిటీ..
75.2 స్కోర్‌తో ఈ యూనివర్సిటీ 2025 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 55వ స్థానాన్ని దక్కించుకుంది. జపాన్‌లోని పురాతన విద్యా సంస్థల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయ చరిత్ర 1897 నాటిది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిల్లో విద్యార్థులు పలు కోర్సులను ఎంచుకోవచ్చు.
టోహోకు విశ్వవిద్యాలయం
యునెస్కో వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 లో 120 వ స్థానంలో ఉన్న తోహోకు విశ్వవిద్యాలయం.. జపాన్‌లో మూడవ స్థానంలో ఉంది. విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇది 10 అండర్ గ్రాడ్యుయేట్ పాఠశాలలు, 19 గ్రాడ్యుయేట్ పాఠశాలలు, 6 పరిశోధనా సంస్థలు, 12 పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయ హాస్పిటల్స్ని కలిగి ఉంది.
ఒసాకా యూనివర్శిటీ..
వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో ఒసాకా యూనివర్సిటీ 162వ స్థానంలో నిలిచింది. ఈ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కోర్సులను అందిస్తుంది. హ్యుమానిటీస్, హ్యూమన్ సైన్సెస్, లా అండ్ పాలిటిక్స్, ఎకనామిక్స్, మెడికల్ సైన్సెస్, తదితర విభాగాలు ఉన్నాయి.