HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Southern Railway Recruitment: సదరన్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; ఏపీలో ఆ రెండు జిల్లాల వారికే చాన్స్

Southern Railway Recruitment: సదరన్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; ఏపీలో ఆ రెండు జిల్లాల వారికే చాన్స్

HT Telugu Desk HT Telugu

24 July 2024, 20:12 IST

  • సదరన్ రైల్వే 2,440 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 12. అయితే, ఎంపిక చేసిన ప్రాంతాల అభ్యర్థులు మాత్రమే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో అప్లై చేసుకోవడానికి అర్హులు. వారిలో ఆంధ్ర ప్రదేశ్ లోని రెండు జిల్లాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సదరన్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్
సదరన్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్

సదరన్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్

సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయింది. అర్హులైన అభ్యర్థులు దక్షిణ రైల్వే అధికారిక వెబ్సైట్ sr.indianrailways.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దక్షిణ రైల్వేలో దాదాపు 2,440 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ ఆగస్ట్ 12

సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్ట్ లకు జులై 22 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆగస్టు 12. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం దక్షిణ రైల్వే అధికారిక వెబ్సైట్ sr.indianrailways.gov.in చూడాలి.

వయో పరిమితి

సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థులకు కనీసం 15 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వీరు మాత్రమే అర్హులు

దక్షిణ రైల్వే భౌగోళిక పరిధిలో ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరిలో ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాల వారికి కూడా అవకాశం ఉంటుంది.

తమిళనాడు

పుదుచ్చేరి

కేరళ

అండమాన్ నికోబార్

లక్షద్వీప్ దీవులు

ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాలు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు

కర్ణాటకలోని ఒకే ఒక జిల్లా: దక్షిణ కన్నడ

విద్యార్హతలు

'ఫిట్టర్', 'వెల్డర్' పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10+2 విద్యావిధానం ప్రకారం కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎస్ఎస్ఎల్సీలో కనీసం 50 శాతం మార్కులు వర్తించవు.

ఎంపిక విధానం

మెట్రిక్యులేషన్ (కనీసం 50% మొత్తం మార్కులతో), ఐటీఐ పరీక్ష రెండింటిలోనూ అభ్యర్థులు సాధించిన మార్కుల సగటును తీసుకొని, ఇద్దరికీ సమాన వెయిటేజీ ఇచ్చి ఎంపికకు మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

ప్రాసెసింగ్ ఫీజు

రూ.100 నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు వర్తించే సర్వీస్ ఛార్జీలను ఆన్ లైన్ లో చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులు అధికారిక సదరన్ రైల్వే వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్