తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Petrol Diesel Price : దేశంలో పెట్రోల్​- డీజిల్​ ధరలు తగ్గుతాయా?

Petrol diesel price : దేశంలో పెట్రోల్​- డీజిల్​ ధరలు తగ్గుతాయా?

Sharath Chitturi HT Telugu

10 September 2022, 9:08 IST

google News
    • Petrol diesel price today : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. మరి దేశీయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గుతాయా?
దేశంలో పెట్రోల్​- డీజిల్​ ధరలు తగ్గుతాయా?
దేశంలో పెట్రోల్​- డీజిల్​ ధరలు తగ్గుతాయా?

దేశంలో పెట్రోల్​- డీజిల్​ ధరలు తగ్గుతాయా?

Petrol diesel price : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు.. గత కొన్ని నెలలతో పోల్చుకుంటే భారీగా పతనమయ్యాయి. మరి దేశీయంగా పెట్రోల్​ డీజిల్​ ధరలు తగ్గుతాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతోంది. అయితే.. ఇప్పట్లో పెట్రోల్​ డీజిల్​ ధరలను తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తెలుస్తోంది.

పెట్రోల్​, డీజిల్​, ఏటీఎఫ్​(ఏవియేషన్​ టర్బైన్​) వంటి పెట్రోలియం ఉత్పత్తులపై వచ్చే వారంలో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. ఇందులో భాగంగా.. ఆయా పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన విండ్​ఫాల్​ ట్యాక్స్​పైనా సమీక్ష చేయనుంది. ఇదే సమయంలో రీటైల్​ పెట్రోల్​, డీజిల్​ ధరలపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా చమురు ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు నెలకొన్నాయి. బుధవారం.. బ్యారెల్​పై 88 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర.. గురువానికి 90డాలర్లకు చేరింది. ఇక శుక్రవారం.. బ్రెంట్​ క్రూడ్​ బ్యారెల్​కు 92డాలర్లకు చేరింది.

Petrol diesel price today : అయితే.. పెట్రోల్​ డీజిల్​ ధరలను స్థిరీకరించేందుకు కేంద్రం కొన్ని నెలల క్రితం కృషి చేసింది. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్​ 7 నుంచి ఆయా ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఆధారిత ఓఎంసీ(ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు)లు.. డీజిల్​పై లీటరుకు రూ. 5-6 నష్టపోతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. లీటరు పెట్రోల్​పై రూ. 2-3 మార్జిన్లు సంపాదిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద.. ఆయా కంపెనీలను మొత్తం కలుపుకుంటే.. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 18,480.27కోట్ల నష్టం వాటిల్లింది.

"ఈ నెల 14 వరకు ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే.. విండ్​ఫాల్​ ట్యాక్స్​ని తగ్గించే అవకాశం ఉంది. కానీ పూర్తిగా తొలగించకపోవచ్చు," అని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

అంతర్జాతీయంగా ముడి చమురు భారీగా పెరగడం, తగ్గడంతో.. విండ్​ఫాల్​ ట్యాక్స్​ని జులై 1న విధించింది కేంద్రం. ఏదైనా కారణాలతో చమురు రిఫైనరీ సంస్థలకు అనూహ్య లాభాలు పొందుతున్నట్టు అయితే.. వాటిపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ. 96.72గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 89.62గా ఉంది. ఈ ధరల్లో మార్పులు చేటుచోసుకోకపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

తదుపరి వ్యాసం