HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajkot Fire: రాజ్ కోట్ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాదంలో 32 కి పెరిగిన మృతుల సంఖ్య

Rajkot Fire: రాజ్ కోట్ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాదంలో 32 కి పెరిగిన మృతుల సంఖ్య

HT Telugu Desk HT Telugu

26 May 2024, 12:59 IST

  • గుజరాత్ లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక గేమింగ్ రూమ్ లో మంటలు వ్యాపించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సొంత రాష్ట్రలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అగ్ని ప్రమాదం జరిగిన గేమింగ్ జోన్
అగ్ని ప్రమాదం జరిగిన గేమింగ్ జోన్ (PTI)

అగ్ని ప్రమాదం జరిగిన గేమింగ్ జోన్

Rajkot Fire: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న ఒక గేమింగ్ రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో పలువురు చిన్నారులు సహా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Mumbai underground metro: మరో వారంలో అందుబాటులోకి రానున్న ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో

Bengaluru news: ధోతి కట్టుకున్నాడని రైతును మాల్ లోనికి అనుమతించలేదు; బెంగళూరులోని జీటీ మాల్ నిర్వాకం

Railway Apprentice Recruitment 2024: రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 2424 పోస్ట్ లు; అర్హత పదో తరగతి మాత్రమే

NVST Class 6 Admissions 2025: జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం

సిట్ దర్యాప్తు

ఈ ప్రమాదంపై సిట్ దర్యాప్తు ప్రారంభమైందని రాష్ట్ర హోం మంత్రి సింఘ్వీ తెలిపారు. దర్యాప్తును త్వరగా ముగించి దోషులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం వెతుకుతున్నామన్నారు. క్షతగాత్రులకు రాజ్ కోట్ ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నామన్నారు.

పోలీసుల అదుపులో ఇద్దరు..

ఈ ప్రమాదానికి సంబంధించి గేమింగ్ రూమ్ ఓనర్, మేనేజర్ లను అదుపులోకి తీసుకున్నట్లు రాజ్ కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గేమ్ జోన్లను తనిఖీ చేయాలని, ఫైర్ సేఫ్టీ అనుమతులు లేని వాటిని మూసివేయాలని గుజరాత్ డీజీపీ పోలీసు కమిషనర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీఆర్పీగా పిలిచే ఈ గేమింగ్ జోన్ కు ఆపరేట్ చేయడానికి అవసరమైన లైసెన్సులు లేవని, రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫైర్ క్లియరెన్స్ కోసం నిరభ్యంతర పత్రం (NOC) కూడా లేదని తెలిసింది. ఈ అగ్నిప్రమాద ఘటనను గుజరాత్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఈ నెల 27న గుజరాత్ హైకోర్టులో విచారణ జరగనుంది.

తదుపరి వ్యాసం