తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ ప్రయాణం: వీడియో వైరల్

Rahul Gandhi: డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ ప్రయాణం: వీడియో వైరల్

07 May 2023, 19:55 IST

google News
    • Rahul Gandhi: ఓ డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ ప్రయాణించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరులో ఉన్న రాహుల్ ఇలా స్కూటర్‌పై కాసేపు తిరిగారు.
Rahul Gandhi: డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ ప్రయాణం: వీడియో వైరల్ (Photo: ANI)
Rahul Gandhi: డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ ప్రయాణం: వీడియో వైరల్ (Photo: ANI)

Rahul Gandhi: డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ ప్రయాణం: వీడియో వైరల్ (Photo: ANI)

Rahul Gandhi - Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10వ తేదీన జరగనుంది. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తరఫున కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్‍ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా చాలా బహిరంగ సభల్లో ప్రసంగాలు చేశారు. ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. అయితే, ఈ క్రమంలో కాన్వాయ్ నుంచి దిగిన రాహుల్.. ఓ డెలివరీ బాయ్ స్కూటర్‌పై ఎక్కారు. ఆ స్కూటర్‌పైనే 2 కిలోమీటర్ల వరకు ప్రయాణించారు.

Rahul Gandhi - Karnataka Elections 2023: కర్ణాటక పోలింగ్‍కు మూడు రోజుల ముందు ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో మార్గం మధ్యలో కారు నుంచి కిందికి దిగారు. అక్కడి వారితో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ ఎక్కారు. ఆ స్కూటర్‌పై సుమారు 2 కిలోమీటర్ల ప్రయాణించి.. బెంగళూరులో తాను బస చేస్తున్న హోటల్‍కు చేరుకున్నారు. స్కూటర్‌పై రాహుల్ ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, ఎలాగైనా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కష్టపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రెండు పార్టీల ప్రముఖ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బీజేపీ తరఫున చాలా సభల్లో ప్రసంగించారు. బీజేపీకి మరోసారి అధికారం అప్పగించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‍పై విమర్శల దాడి చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కూడా కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. హస్తం పార్టీకి మళ్లీ అధికారం అప్పగించాలని ప్రజలను కోరారు. బీజేపీపై ఆరోపణలు చేశారు.

Karnataka Elections 2023: బెంగళూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆదివారం మెగా రోడ్‍షో నిర్వహించారు. 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో సాగింది. శనివారం 26 కిలోమీటర్ల రోడ్ షో జరగగా.. ఆదివారం మరో 10 కిలోమీటర్ల పాటు సాగింది. రహదారి పొడవునా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు.. ప్రధాని మోదీపై పూలవర్షం కురిపించారు. మోదీ సైతం అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10వ తేదీన ఒకేదశలో పోలింగ్ జరుగుతుంది. 13వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.

తదుపరి వ్యాసం