తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mallikarjun Kharge Assassination : 'కాంగ్రెస్​ అధ్యక్షుడు ఖర్గే హత్యకు బీజేపీ నేత కుట్ర!'

Mallikarjun Kharge assassination : 'కాంగ్రెస్​ అధ్యక్షుడు ఖర్గే హత్యకు బీజేపీ నేత కుట్ర!'

Sharath Chitturi HT Telugu

19 May 2023, 13:03 IST

google News
    • Mallikarjun Kharge assassination : తమ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్​ ఆరోపించింది. కర్ణాటక బీజేపీ నేత, ఛిత్తాపూర్​ నియోజకవర్గం అభ్యర్థి మణికంఠ రాథోడ్​.. ఖర్గేతో పాటు ఆయన కుటుంబసభ్యులను హత్య చేసేందుకు ప్లాన్​ వేస్తున్నారని పేర్కొంది.
మల్లిఖార్జున ఖర్గే
మల్లిఖార్జున ఖర్గే (Congress Twitter)

మల్లిఖార్జున ఖర్గే

Mallikarjun Kharge assassination : మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్​ సంచలన ఆరోపణలు చేసింది! తమ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆయన కుటుంబసభ్యులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంది. ఓ బీజేపీ నేత.. ఖర్గేను చంపేందుకు ప్లాన్​ వేస్తున్నారంటూ.. ఓ ఆడియో టేప్​ను విడుదల చేసింది.

ఆడియో టేప్​లో ఏముంది..?

సంబంధిత బీజేపీ నేత, ఛిత్తాపూర్​ నియోజకవర్గం అభ్యర్థి మణికంఠ రాథోడ్​.. ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నట్టు ఆ ఆడియో టేప్​లో ఉంది. 

Manikanta Rathod BJP : "మల్లిఖార్జున ఖర్గే, ఆయన భార్య, పిల్లలను చంపేందుకు ప్లాన్​ వేస్తున్నారు. దీనిని చిన్న విషయంగా చూడకూడదు. ఖర్గే సాధారణ మనిషి కాదు. ఛిత్తాపూర్​ బీజేపీ అభ్యర్థి గురించి నాకు, ప్రధాని మోదీ, సీఎం బసవరాజ్​ బొమ్మై కన్నా మీకే (కర్ణాటక ప్రజలు) ఎక్కువ తెలసు. ఈ విషయంపై ప్రధాని మౌనంగానే ఉంటారు. కర్ణాటక పోలీసులు, ఎన్నికల సంఘం కూడా నిశ్శబ్దంగానే ఉంటాయి. కానీ కర్ణాటక ప్రజలు మౌనంగా ఉండరు. సరైన సమాధానం ఇస్తారు," అని కాంగ్రెస్​ నేత రణ్​దీప్​ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.

ఖర్గే హత్యకు జరుగుతున్న కుట్రపై బీజేపీ నేత మాట్లాడుతున్న టేప్​ తమకు లభించిందని సుర్జేవాలా తెలిపారు. ఇది దిగజారుడు రాజకీయాలని మండిపడ్డారు. "ఎన్నికల్లో కాంగ్రెస్​ చేతిలో ఘోర పరాభవం తప్పదని తెలుసుకున్న బీజేపీ.. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ఆయన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఛిత్తాపూర్​ బీజేపీ అభ్యర్థి మాటల్లో ఇది స్పష్టమవుతోంది. ఇది కర్ణాటక బిడ్డ, కర్ణాటక మట్టికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్య," అని మండిపడ్డారు సుర్జేవాలా.

మణికంఠ రాథోడ్​ వర్సెస్​ ప్రియాంక ఖర్గే..

Manikanta Rathod vs Priyank Kharge : మణికంఠ రాథోడ్​పై ఇప్పటికే 30కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఈయన్ని కలబురగి ప్రాంతం నుంచి ఏడాది పాటు బహిష్కరించారు కూడా. మల్లిఖార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్​ ఖర్గేను చంపేస్తానని బెదిరించినందుకు.. గతేడాది నవంబర్​ 13న రాథోడ్​ అరెస్ట్​ అయ్యారు. అనంతరం బెయిల్​పై విడుదలయ్యారు. అయితే కాంగ్రెస్​ విడుదల చేసిన ఆడియో టేప్​ను వెరిఫై చేయడం కష్టంగా మారింది.

ప్రస్తుతం.. ఛిత్తాపూర్​ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్​పై బరిలో దిగుతున్నారు రాథోడ్​. ప్రియాంక్​ ఖర్గే.. కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తున్నారు.

Karnataka elections 2023 : 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇంకొన్ని మాత్రం.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సూచిస్తున్నాయి.

తదుపరి వ్యాసం