తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిచిపోయిందన్న మస్క్

ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిచిపోయిందన్న మస్క్

HT Telugu Desk HT Telugu

13 May 2022, 15:45 IST

google News
  • స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన సమాచారం పెండింగ్‌లో ఉండడంతో 44 బిలియన్ డాలర్ల ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టినట్టు ఇలాన్ మస్క్ శుక్రవారం ప్రకటించారు.

తాత్కాలికంగా నిలిచిపోయిన ట్విటర్ డీల్
తాత్కాలికంగా నిలిచిపోయిన ట్విటర్ డీల్ (AP)

తాత్కాలికంగా నిలిచిపోయిన ట్విటర్ డీల్

‘స్పామ్, నకిలీ ఖాతాలు వాస్తవానికి 5% కంటే తక్కువ వినియోగదారులను సూచిస్తాయన్న గణనకు ఉపయోగపడే వివరాలు పెండింగ్‌లో ఉండడంతో ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిచిపోయింది..’ అని మస్క్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

కాగా ప్రి మార్కెట్ ట్రేడింగ్‌లో ఈ సోషల్ మీడియా కంపెనీ షేర్లు 20% పడిపోయాయి. కాగా దీనిపై కామెంట్ కోసం చేసిన అభ్యర్థనకు ట్విట్టర్ వెంటనే స్పందించలేదు.

మానిటైజేషన్‌కు అవకాశం కలిగిన రోజువారీ క్రియాశీల ఖాతాదారుల్లో నకిలీ ఖాతాలు 5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది.

ఇలాన్ మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు చేయడం కొనసాగించాలా వద్దా అనే దానితో సహా అనేక నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా కంపెనీ పేర్కొంది.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలాన్ మస్క్ ఈ ట్విటర్ ప్లాట్‌ఫామ్ నుంచి ‘స్పామ్ బాట్‌’లను తొలగించడం తన ప్రాధాన్యతలలో ఒకటి అని చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం