LSAT Result 2024: ప్రముఖ లా కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘ఎల్ శాట్ 2024’ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..
Published Jun 08, 2024 02:16 PM IST
- LSAT Result 2024: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ లా కాలేజీల్లో ప్రవేశానికి వీలు కల్పించే లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2024 (LSAT 2024) ఫలితాలను పియర్సన్ వీయూఈ శనివారం వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్ సైట్ lsatindia.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎల్ సాట్ 2024 ఫలితాల వెల్లడి
లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (LSAT 2024) ఇండియా 2024 ఫలితాలను పియర్సన్ వీయూఈ శనివారం విడుదల చేసింది. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు lsatindia.in వెబ్ సైట్ లో తమ స్కోర్ కార్డులను చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డులు అభ్యర్థి డ్యాష్ బోర్డులో కనిపిస్తాయి. అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అభ్యర్థులు 420 నుండి 480 మధ్య స్కేల్ స్కోర్, పర్సంటైల్ ర్యాంక్ పొందుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు. మార్క్స్ షీట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే విద్యార్థులు యూజర్ నేమ్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ లా కాలేజీల్లో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.
ఎల్ శాట్ ఇండియా రిజల్ట్ 2024 ఎలా చెక్ చేయాలి
లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2024 ఫలితాలను (LSAT Result 2024) చెక్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా ఎల్ శాట్ అధికారిక వెబ్ సైట్ lsatindia.in ను ఓపెన్ చేయండి.
- అభ్యర్థి రిజిస్ట్రేషన్ పేజీని ఓపెన్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి.
- వివరాలు సమర్పించి లాగిన్ అవ్వాలి.
- రిజల్ట్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
ఎల్ శాట్ 2024 మార్క్స్ షీట్స్
ఎల్ శాట్ 2024 పరీక్ష రాసిన విద్యార్థులకు వారి స్కోర్ కార్డులు, మార్క్స్ షీట్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయని పియర్సన్ వీయూఈ వెల్లడించింది. వాటిని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయగానే విద్యార్థులకు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి సమాచారం పంపిస్తామని తెలిపింది. కాబట్టి, విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ రిజిస్టర్డ్ ఈ మెయిల్ ను చెక్ చేసుకోవాలని సూచించింది.
ప్రముఖ లా కాలేజీల్లో అడ్మిషన్స్
లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్ ఎస్ ఏసీ) 2024 మే 16 నుంచి మే 19 వరకు ఎల్ శాట్ ఇండియా 2024ను నిర్వహించింది. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 2 గంటల 30 నిమిషాల పాటు పరీక్ష జరిగింది. అనలిటికల్ రీజనింగ్ (23 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ -1 (22 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ -2 (23 ప్రశ్నలు), రీడింగ్ కాంప్రహెన్షన్ (24 ప్రశ్నలు) కలిపి మొత్తం 92 ప్రశ్నలు ఉన్నాయి. ఈ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా దేశంలోని ప్రముఖ లా కాలేజీలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లకు లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. ఈ కళాశాలలు, ఎల్ శాట్ ఇండియాతో అనుసంధానమై ఉంటాయి. అభ్యర్థులు ఎల్ శాట్ ఇండియా 2024 గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
టాపిక్