Lucky draw: సింగపూర్ లో భారతీయుడికి జాక్ పాట్; భార్య మాట విన్నందుకు మిలియనీర్ అయ్యాడు..
30 November 2024, 15:31 IST
Lucky draw: సింగపూర్ లో ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. తన భార్యకు బంగారం కొనడంతో, అక్కడ ఏర్పాటు చేసిన లక్కీ డ్రా లో ఆ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా రూ. 8 కోట్ల జాక్ పాట్ అతడిని వరించింది. తన తండ్రి వర్ధంతి సందర్భంగా తనకు ఈ అదృష్టం వరించిందని ఆ వ్యక్తి సంతోషపడిపోతున్నాడు.
సింగపూర్ లో భారతీయుడికి జాక్ పాట్
Lucky draw: సింగపూర్ లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్లు (రూ.8 కోట్లకు పైగా) గ్రాండ్ ప్రైజ్ గెలుచుకుని ఓవర్ నైట్ మిలియనీర్ గా మారాడు. ఈ విజయానికి కారణం అతడి భార్యనే. ఎందుకంటే, ఆమె కోరిక మేరకు అతడు తన భార్య కోసం 3 నెలల క్రితం బంగారం కొనుగోలు చేసిన సందర్భంగా ఈ లక్కీ డ్రా లో భాగస్వామ్యం పొందాడు. దాంతో, అతని ఈ విజయం అతని భార్యను మరింత థ్రిల్ కు గురి చేసింది.
తండ్రి వర్ధంతి రోజు
లక్కీ డ్రాలో తనకు మిలియన్ డాలర్ల జాక్ పాట్ లభించడంపై ఆ వ్యక్తి ఆనందోత్సాహాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ముఖ్యంగా, ఈ వార్త తనకు తన తండ్రి వర్ధంతి రోజు తెలిసిందని, ఇది తనకు తన తండ్రి ఇచ్చిన బహుమతిగా భావిస్తానని ఆ వ్యక్తి ఆనందభాష్పాలతో చెప్పాడు. గత ఆదివారం (నవంబర్ 24) సింగపూర్ లో ముస్తఫా జ్యువెలరీ నిర్వహించిన లక్కీ డ్రాలో బాలసుబ్రమణియన్ చిత్తంబరం టాప్ ప్రైజ్ గెలుచుకున్నాడు. అతడు సింగపూర్ లోని ఒక ప్రైవేటు సంస్థలో గత 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
6 వేల డాలర్లతో బంగారు ఆభరణాలు
ముస్తఫా జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో భాగంగా, సివిల్ సర్వీస్ క్లబ్ @ టెస్సెన్సోన్ లో ఈ డ్రా ను నిర్వహించారు. నగల దుకాణంలో కనీసం 250 అమెరికన్ డాలర్లు ఖర్చు చేసిన కస్టమర్లు డ్రాకు అర్హులు. లిటిల్ ఇండియాలోని ఈ దుకాణాన్ని సందర్శించిన సమయంలో చితంబరం తన భార్యకు 6,000 అమెరికన్ డాలర్లు ఖర్చు చేసి బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు.
విరాళం ఇస్తా..
ఈ వార్త విన్న అనంతరం వీడియో కాల్ ద్వారా కన్నీటి పర్యంతమైన చిత్తంబరం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 'ఈ రోజు మా నాన్న నాలుగో వర్ధంతి' అని గుర్తు చేసుకున్నారు. ఈ శుభవార్తను తన తల్లితో పంచుకున్నానని, సింగపూర్ లో పనిచేసిన సంవత్సరాలకు కృతజ్ఞతగా తన విజయాల్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మీ భార్య మాట వినండి..
ఈ విషయం తెలిసిన వారు భార్య మాట వింటే ఇలా అదృష్టం కలిసి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తంబరం ఒక్కడే కాదు.. గతంలో చాలామంది తమ జీవిత భాగస్వామి సలహాను పాటించి, అదృష్టవంతులు అయ్యారు. ఏప్రిల్ 2023 లో, మలేషియాలోని క్లాంగ్ కు చెందిన ఒక వ్యక్తి తన భార్య మాటలు విన్న తరువాత 3 మిలియన్ డాలర్లు (900,000 అమెరికన్ డాలర్లు) గెలుచుకున్నాడు. చెంగ్ అనే వ్యక్తి సాధారణ లాటరీ ప్లేయర్, కానీ అతని సాధారణ నంబర్లు జనవరిలో అమ్ముడుపోయాయి. భార్య సూచన మేరకు బిగ్ స్వీప్ టికెట్ కొనుక్కున్నాడు. ఆ టికెట్ కు 3 మిలియన్ డాలర్ల జాక్ పాట్ తగిలింది.