తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Railways : రైలు ప్రయాణికులకు అలర్ట్​! జనవరి 1 నుంచి కొత్త టైమ్​టేబుల్​..!

Indian Railways : రైలు ప్రయాణికులకు అలర్ట్​! జనవరి 1 నుంచి కొత్త టైమ్​టేబుల్​..!

Sharath Chitturi HT Telugu

Published Dec 28, 2024 09:40 AM IST

google News
  • Indian Railways new time table : 2025 జనవరి 1 నుంచి రైల్వై టైమ్​టేబుల్​ మారనుంది.  కొత్త షెడ్యూల్​లో 136 వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైళ్లు, ఇతర సేవలను ప్రారంభిస్తారు. ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జనవరి 1 నుంచి కొత్త టైమ్​టేబుల్! (HT_PRINT)

జనవరి 1 నుంచి కొత్త టైమ్​టేబుల్!

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్​! జనవరి 1, 2025 నుంచి భారతీయ రైల్వే కొత్త టైమ్​టేబుల్​ని అమలు చేయనుంది. “ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్” 44వ ఎడిషన్​కి సంబంధించిన ప్రస్తుత టైమ్​టేబుల్ 2024 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది.


కొత్త టైమ్​టేబుల్​..

గత ఏడాది, భారతీయ రైల్వే ఆల్ ఇండియా రైల్వే టైమ్​టేబుల్ - ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (టీఏజీ)ని విడుదల చేసింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. టీఏజీ అధికారిక ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్​లో కూడా అందుబాటులో ఉంది.

2025 నాటికి మొత్తం 136 వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైళ్లు, 2 అమృత్ భారత్ ఎక్స్​ప్రెస్​ రైళ్లు, నమో భారత్ ర్యాపిడ్ రైల్ (వందే మెట్రో) రైళ్లను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించడానికి గత ఏడాది 64 వందే భారత్ రైళ్లను, 70 అదనపు సర్వీసులను ప్రవేశపెట్టింది.

ఇక ఈ కొత్త రైల్వే టైమ్​టేబుల్​లో ఏం ఉంటుంది? కొత్తగా ఎలాంటి మార్పులు వస్తాయి? వంటి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

సాధారణంగా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ 30 లోపు “ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్” (టీఏజీ) వర్కింగ్ టైమ్​టేబుల్​ని విడుదల చేస్తుంది. జులై 1 నుంచి కొత్త టైమ్​టేబుల్ అమల్లోకి వస్తుంది. అయితే, ఈ ఏడాది నిబంధనలను సవరించారు.

ఇదిలావుండగా.. మహా కుంభమేళా 2025 కు సన్నాహకంగా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) ఈ కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తోంది. సుమారు 3,000 ప్రత్యేక ఫెయిర్ రైళ్లను నడపడంతో పాటు లక్ష మందికి పైగా ప్రయాణికులకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా, భారతీయ రైల్వే పర్యాటక, ఆతిథ్య బ్రాంచీ అయిన ఐఆర్​సీటీసీ త్రివేణి సంగం సమీపంలో మహాకుంభ్ గ్రామ్ అనే లగ్జరీ టెంట్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసింది.

జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు మహాకుంభ్ గ్రామ్​లో బస కోసం ఆన్​లైన్​ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఆర్​సీటీసీ వెబ్​సై​ట్, టూరిజం డిపార్ట్​మెంట్ వెబ్​సైట్లు, మహాకుంభ్ యాప్​లో అదనపు సమాచారం అందుబాటులో ఉండటంతో ఐఆర్​సీటీసీ వెబ్​సైట్ ద్వారా సులభంగా రిజర్వేషన్లు చేసుకోవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం