తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Notifications : నిరుద్యోగులకు అలర్ట్​​- త్వరలోనే ఐబీపీఎస్​ పీవో, క్లర్క్​ నోటిఫికేషన్లు విడుదల..

IBPS notifications : నిరుద్యోగులకు అలర్ట్​​- త్వరలోనే ఐబీపీఎస్​ పీవో, క్లర్క్​ నోటిఫికేషన్లు విడుదల..

Sharath Chitturi HT Telugu

02 June 2024, 17:15 IST

google News
    • Bank jobs in Hyderabad : నిరుద్యోగులకు అలర్ట్!​ ఐబీపీఎస్​ పీవో 2024, ఐబీపీఎస్​ క్లర్క్ 2024తో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
త్వరలోనే ఐబీపీఎస్​ పీవో, క్లర్క్​ నోటిఫికేషన్లు విడుదల..
త్వరలోనే ఐబీపీఎస్​ పీవో, క్లర్క్​ నోటిఫికేషన్లు విడుదల..

త్వరలోనే ఐబీపీఎస్​ పీవో, క్లర్క్​ నోటిఫికేషన్లు విడుదల..

IBPS calender 2024 : ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రొబేషనరీ ఆఫీసర్స్ (ఐబీపీఎస్ పీవో 2024), క్లర్క్ (ఐబీపీఎస్ క్లర్క్ 2024) రిక్రూట్మెంట్, ఆర్ఆర్బీ పీవో, ఆర్ఆర్బీ క్లర్క్ నోటిఫికేషన్లను త్వరలో విడుదల చేయనుంది. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం.. ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ పీవో, ఆర్ఆర్బీ క్లర్క్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో జరగనున్నాయి. అందువల్ల త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత నోటిఫికేషన్లు విడుదలయ్యాక అభ్యర్థులు ibps.in ఐబీపీఎస్ క్లర్క్, పీవో నోటిఫికేషన్లతో పాటు అర్హత ప్రమాణాలు, ఖాళీల సంఖ్య, పరీక్ష సరళి, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.

ఐపీబీఎస్ పరీక్షలు 2024: టెంటెటివ్​ డేట్స్​..

IBPS PO notification : ఐబీపీఎస్​ క్యాలెండర్​ 2024 ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. దాని ప్రకారం.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీవో) ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 3, 5, 10, 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ముందుగా ఈ పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 19, 20 తేదీల్లో, మెయిన్ పరీక్షను నవంబర్ 30న నిర్వహించనున్నారు.

ఐబీపీఎస్ ఎస్​వో ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్ 9న, మెయిన్ పరీక్ష డిసెంబర్ 14న జరగనుంది.

IBPS rrb notification 2024 : ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 13న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలన్నింటికీ రిజిస్ట్రేషన్లు ఆన్​లైన్​లో జరుగుతాయని, ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు ఒకే రిజిస్ట్రేషన్ విండో ఉంటుందని సంస్థ తెలిపింది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందు, అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

దరఖాస్తుదారుని ఫోటో - .jpeg ఫైలులో 20 కేబీ నుంచి 50 కేబీ వరకు

దరఖాస్తుదారుని వేలిముద్ర - .jpeg ఫైలులో 20 కేబీ నుంచి 50 కేబీ వరకు

IBPS notifications 2024 : దరఖాస్తుదారుని సంతకం - .jpeg ఫైల్ లో 10 కేబీ నుంచి 20 కేబీ వరకు

చేతివ్రాత డిక్లరేషన్ స్కాన్డ్ కాపీ - .jpeg ఫైల్ లో 50 కేబీ నుంచి 100 కేబీ వరకు.

యూపీఎస్సీ నోటిఫికేషన్ 2024..

డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ని విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). అర్హులైన అభ్యర్థులు జూన్ 13, 2024లోగా యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ upsconline.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం