తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Polls: ‘‘నాకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీకి చుక్కలు చూపిస్తా..’’

Karnataka polls: ‘‘నాకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీకి చుక్కలు చూపిస్తా..’’

HT Telugu Desk HT Telugu

08 January 2024, 18:56 IST

google News
  • Karnataka polls: బీజేపీ (BJP) సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ (Jagadish Shettar) బీజేపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే, తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. 

బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్
బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్

బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్

Karnataka polls: బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ (Jagadish Shettar) బీజేపీ అధిష్టానానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం వరకు వేచి చూస్తానని, అప్పటికి తనకు తన స్థానం కేటాయింపుపై స్పష్టత ఇవ్వకపోతే, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

Karnataka polls: 25 స్థానాల్లో ప్రభావం చూపిస్తా..

హుబ్లీ - ధర్వాడ్ (Hubli-Dharwad Central) నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ను బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ (Jagadish Shettar) ఆశిస్తున్నారు. అయితే, ఆ స్థానం నుంచి టికెట్ ఇవ్వలేమని ఇప్పటికే బీజేపీ (BJP) జగదీశ్ షెట్టర్ (Jagadish Shettar) కు స్పష్టం చేసింది. అయితే, ఆయన తన ప్రయత్నాలను వీడలేదు. చివరకు, బీజేపీ అధిష్టానాన్నే హెచ్చరించడం ప్రారంభించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే, కనీసం 20 నుంచి 25 స్థానాల్లో బీజేపీ (BJP) విజయావకాశాలను దెబ్బ తీస్తానని జగదీశ్ షెట్టర్ (Jagadish Shettar) హెచ్చరించారు. నేరుగా విలేకరుల సమావేశంలోనే ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.

Karnataka polls: మరో 12 స్థానాలపై ఉత్కంఠ

224 స్థానాల కర్నాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మరో 12 నియోజకవర్గాలకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అందులో జగదీశ్ షెట్టర్ (Jagadish Shettar) టికెట్ ఆశిస్తున్న హుబ్లి - ధార్వాడ్ సెంట్రల్ (Hubli-Dharwad Central) కూడా ఉంది. సీనియర్ నాయకులతో వ్యవహరించే తీరును పార్టీ మార్చుకోవాలని ఆయన సూచించారు. ‘‘షెట్టర్ కు టికెట్ ఇవ్వకపోతే, చాలా స్థానాల్లో అది ప్రతికూల ప్రభావం చూపుతుంది అని చివరకు సీనియర్ నేత యెడియూరప్ప కూడా చెప్పారు’’ అని జగదీశ్ షెట్టర్ వెల్లడించారు. కనీసం 20 నుంచి 25 స్థానాల్లో కచ్చితంగా ప్రభావం ఉంటుందని షెట్టర్ (Jagadish Shettar) స్పష్టం చేశారు. షెట్టర్ కు టికెట్ ఇవ్వనట్లయితే, రాజీనామాకు సిద్ధమని హుబ్బలి - ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బీజేపీ (BJP) కౌన్సిలర్లు సిద్ధమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తదుపరి వ్యాసం