తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi News: జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేనని విద్యార్థిని ఆత్మహత్య; క్షమించమని సూసైడ్ నోట్

Delhi news: జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేనని విద్యార్థిని ఆత్మహత్య; క్షమించమని సూసైడ్ నోట్

Sudarshan V HT Telugu

26 October 2024, 21:49 IST

google News
  • Delhi Crime news: ఢిల్లీలో ఒక 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనని తానుంటున్న భవనం 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్ పరీక్ష జేఈఈ లో ఉత్తీర్ణత సాధించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేనని విద్యార్థిని ఆత్మహత్య
జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేనని విద్యార్థిని ఆత్మహత్య

జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేనని విద్యార్థిని ఆత్మహత్య

Delhi Crime news: ఢిల్లీలోని జామియా నగర్ లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)లో ఉత్తీర్ణత సాధించడంలో విఫలం అవుతానన్న భయంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. షహీన్ బాగ్ లోని ఓ నివాస భవనం ఏడో అంతస్తు నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది.

క్షమించమని సూసైడ్ నోట్

ఆ బాలిక గదిలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆ బాలిక ‘నన్ను క్షమించండి, నేను చేయలేను. నేను జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేను’’ అని రాశారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో పీఎస్ జామియా నగర్ లోని ఓఖ్లా ప్రధాన మార్కెట్ లోని ఓ భవనం 7వ అంతస్తు పైనుంచి దూకి ఆ 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికిి వెళ్లి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ‘‘ఆ 17 సంవత్సరాల బాలిక 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత జేఈఈ (JEE)కి ప్రిపేర్ అవుతోంది. చదువు ఒత్తిడి, అంచనాలను అందుకోలేదనే కారణంతో ఆమె సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది’’ అని పోలీసులు తెలిపారు.

ముందే తల్లికి చెప్పింది..

ఇంజినీరింగ్ పరీక్ష జేఈఈలో ఉత్తీర్ణత సాధించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 194 కింద దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఆన్ లైన్ వేధింపుల కారణంగా

మరో ఘటనలో ఆన్ లైన్ వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు జిల్లా ఉరత్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్యాలో చోటుచేసుకుంది. ఈ కేసులో షరీక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్లను అధిక మోతాదులో తీసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

తదుపరి వ్యాసం