CSIR UGC NET Results: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 రిజల్ట్స్ వచ్చేశాయి.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
12 September 2024, 21:50 IST
- CSIR UGC NET Result 2024: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెప్టెంబర్ 12, 2024 న ఈ ఫలితాలను విడుదల చేసింది. స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది సూచనలు పాటించాలి.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రిజల్ట్
CSIR UGC NET Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెప్టెంబర్ 12, 2024 న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 ఫలితాలను విడుదల చేసింది. జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు సీఎస్ఐఆర్ అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in లో తమ స్కోర్ కార్డులను చెక్ చేసుకోవచ్చు. ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ nta.ac.in లో కూడా అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థులు వారి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు.
స్కోర్ కార్డ్ లు పోస్ట్ లో పంపించరు
అభ్యర్థులకు హార్డ్ కాపీ పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా స్కోర్ కార్డ్ లను పంపించరన్న విషయం గమనించాలి. అభ్యర్థులు ఆన్ లైన్ లో తమ ఫలితాలను చెక్ చేసుకుని,రిజల్ట్ పేజీ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ ఏడాది సీఎస్ఐఆర్ యూజీసీ పరీక్షకు 2,25,335 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 1,63,529 మంది సీఎస్ఐఆర్ యూజీసీ పరీక్షకు హాజరయ్యారు.
స్కోర్ కార్డులను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి
అభ్యర్థులు ఈ క్రింది సరళమైన దశలను అనుసరించడం ద్వారా స్కోర్ కార్డు లను చెక్ చేయవచ్చు, అలాగే, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అభ్యర్థులు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ csirnet.nta.ac.in ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
జూలై 25, 26, 27 తేదీల్లో
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (UGC NET 2024) పరీక్షను 2024 జూలై 25, 26, 27 తేదీల్లో నిర్వహించారు. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. జులై 27న మొదటి షిఫ్టులో మాత్రమే పరీక్ష నిర్వహించారు. 187 నగరాల్లోని 348 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. సీఎస్ఐఆర్ తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులకు ఎన్టీఏ (NTA) సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.