తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Assembly Elections: సిద్ధరామయ్యకు కోలార్ టికెట్ ఇవ్వని కాంగ్రెస్

Karnataka assembly elections: సిద్ధరామయ్యకు కోలార్ టికెట్ ఇవ్వని కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu

08 January 2024, 18:57 IST

google News
  • Karnataka assembly elections: కర్నాటకలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కు కొలార్ టికెట్ ను అధిష్టానం నిరాకరించింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను పార్టీ శనివారం విడుదల చేసింది.

కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య
కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య

కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య

Karnataka assembly elections: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను (congress third list) పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 43 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 224 నియోజకవర్గాలకు గానూ ఇప్పటివరకు 15 మినహా అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి.

Siddaramaiah denied ticket ఒక్క సీటుకే అవకాశం..

ఈ ఎన్నికల్లో వరుణ స్థానంతో పాటు కోలార్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని సిద్ధరామయ్య (Siddaramaiah) భావించారు. కానీ, ఆయన అభ్యర్థనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించలేదు. కోలార్ (Kolar) నియోజకవర్గం టికెట్ ను మాజీ ఎమ్మెల్యే కొతూరు జీ మంజునాథ్ కు ప్రకటించింది. దాంతో, సిద్ధ రామయ్య (Siddaramaiah) ఒక్క వరుణ స్థానం నుంచి మాత్రమే పోటీ పడే పరిస్థితి నెలకొంది. సిద్ధ రామయ్యకు అవకాశం ఇవ్వకపోతే, కోలార్ నియోజకవర్గం నుంచి కే శ్రీనివాస గౌడకు అవకాశం ఇవ్వవచ్చని వార్తలు వచ్చాయి. శ్రీనివాస గౌడ ఇటీవలనే జేడీఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం శ్రీనివాస గౌడ కు కూడా అవకాశం ఇవ్వలేదు. ముల్బగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంజునాథ్ (Kothur G Manjunath) కు ఈ సారి కోలార్ (Kolar) స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది.

Laxman Savadi gets Athani ticket: అథానీ నుంచి లక్ష్మణ్ సావడి

బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడి కి ఆయన కోరుకున్నట్లు గానే అథానీ (Athani) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది. తాజా జాబితాలో లక్ష్మణ్ సావడి పేరును చేర్చింది. ఈ ఎన్నికల్లో అథానీ నియోజకవర్గం టికెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించడంతో లక్ష్మణ్ సావడి కాంగ్రెస్ లో చేరారు. తాజా జాబితా ప్రకారం.. షిమోగా సిటీ నుంచి హెచ్ సీ యోగేశ్ కు, కుంట నుంచి నివేదిత్ ఆల్వా, ముదిగెరె నుంచి నయన మొతమ్మ, షిమోగా రూరల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ కరియన్నకు అవకాశం కల్పించారు.

తదుపరి వ్యాసం