తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Date Sheet 2025 : 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. సీబీఎస్‌ఈ ఎగ్జామ్ డేట్ షీట్ వచ్చేందుకు సిద్ధం..డౌన్‌లోడ్ ఇలా

CBSE Date Sheet 2025 : 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. సీబీఎస్‌ఈ ఎగ్జామ్ డేట్ షీట్ వచ్చేందుకు సిద్ధం..డౌన్‌లోడ్ ఇలా

Anand Sai HT Telugu

Published Oct 30, 2024 10:14 AM IST

google News
    • CBSE Date Sheet 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్ 2025 డేట్ షీట్‌ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15, 2025 నుండి ప్రారంభం కావొచ్చని అంచనా.
త్వరలో సీబీఎస్ఈ పరీక్షల టైమ్‍టేబుల్

త్వరలో సీబీఎస్ఈ పరీక్షల టైమ్‍టేబుల్

సీబీఎస్ఈ పరీక్షల డేట్ షీట్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులకు కీలకమైనది. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి డేట్ షీట్ 2025పై అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. కానీ దీనికి సంబంధించిన ఊహాగానాలు వస్తున్నాయి. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ 2025 ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో విద్యార్థులకు డేట్ షీట్‌ను 2025 నవంబర్‌లో cbse.gov.inలో ఆన్‌లైన్‌లో విడుదల చేయవచ్చు.

ఇటీవల సీబీఎస్ఈ రెండు తరగతులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను అందించింది. 10వ తరగతికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1, 2025న ప్రారంభం అవుతున్నాయి. 12వ తరగతి ప్రాక్టికల్‌లు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి. మార్కుల విభజనను వివరించే సర్క్యులర్‌ను కూడా బోర్డు జారీ చేసింది.

సీబీఎస్ఈ 10వ ఎగ్జామ్ డేట్ షీట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

సీబీఎస్ఈ క్లాస్ 10 టైమ్ టేబుల్ 2025 విడుదలైన తర్వాత దాన్ని చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inకి వెళ్లండి. హోమ్‌పేజీలో ఎగ్జామినేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. CBSE 10వ తరగతి టైమ్ టేబుల్ లింక్‌పై క్లిక్ చేయాలి. సీబీఎస్ఈ 10వ తరగతి డేట్ షీట్ 2025 సబ్జెక్ట్ పేరు, పరీక్ష తేదీతో పీడీఎఫ్ ఫైల్ వస్తుంది. ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసి, ప్రిపరేషన్ ప్రయోజనాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

సీబీఎస్ఈ క్లాస్ 12 ఎగ్జామ్ డేట్ షీట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

సీబీఎస్ఈ 12వ తరగతి డేట్ షీట్ 2025ని అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో బోర్డు ప్రచురిస్తుంది . ఈ డేట్ షీట్ 2025 క్లాస్ 12కు సంబంధించి ఉంటుంది. cbse.gov.in లేదా cbseacademic.nic.inలోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న సీబీఎస్ఈ 12వ తరగతి డేట్ షీట్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేయాలి.

మునుపటి ట్రెండ్‌ల ఆధారంగా పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి ప్రారంభం సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా ఉంది. గతంలో వేరే తేదీల్లోనూ జరిగాయి. 2021లో మే 4 నుండి జూన్ 7 వరకు పరీక్షలు జరిగాయి.

పరీక్ష తేదీ సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సబ్జెక్టులను రివిజన్ చేయాలి. టైమ్‌టేబుల్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు, ప్రకటనల కోసం సీబీఎస్ఈ వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం