తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru To Chennai: కేవలం 4 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకునేలా వందేభారత్..

Bengaluru to Chennai: కేవలం 4 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకునేలా వందేభారత్..

Sudarshan V HT Telugu

06 December 2024, 19:12 IST

google News
  • Bengaluru to Chennai: బెంగళూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించడానికిి రైల్వే విభాగం ప్రయత్నిస్తోంది. వందేభారత్ ట్రైన్ లో కేవలం నాలుగు గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకునేలా ట్రాక్ అప్ గ్రేడ్ చేయనుంది.

కేవలం 4 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి..
కేవలం 4 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి..

కేవలం 4 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి..

Bengaluru to Chennai: బెంగళూరు నుండి చెన్నైకి మరింత తొందరగా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ద్వారా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని కనీసం 25 నిమిషాలు తగ్గించేలా అప్ గ్రేడ్ చేయనున్నారు. అదే విధంగా శతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రయాణ సమయం కూడా కనీసం 20 నిమిషాలు తగ్గనుంది. ఈ మార్గంలో ఈ రైళ్ల వేగాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టారు.

అధిక డిమాండ్ ఉన్న కారిడార్

దక్షిణ భారత్ లో బెంగళూరు - చెన్నై (chennai news) కారిడార్ కు అధిక డిమాండ్ ఉంటుంది. బెంగళూరు లోని టెక్, స్టార్టప్ హబ్ లను చెన్నై లోని ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ జోన్ లతో అనుసంధానించే ఈ మార్గం చాలా ముఖ్యమైనది. ఈ కారిడార్లో రైలు వేగాన్ని పెంచడానికి నైరుతి రైల్వే చేసిన విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు చేశారు. ఈ మార్గంలో వేగ పరిమితిని గంటకు 110 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకు పెంచే సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి దక్షిణ మధ్య రైల్వే బెంగళూరు డివిజన్ డిసెంబర్ 5న బెంగళూరు-జోలార్ పేట సెక్షన్ లో స్పీడ్ ట్రయల్ నిర్వహించింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదం తెలపగానే సవరించిన వేగాన్ని అమలు చేయనున్నారు.

కొత్తగా మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

ఈ అప్ గ్రేడ్ మొత్తం బెంగళూరు-చెన్నై మార్గాన్ని అనుసంధానిస్తుంది, ఎందుకంటే చెన్నై-జోలార్ పేట విభాగం ఇప్పటికే గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ హై డెన్సిటీ కారిడార్లో రోజూ నడిచే రెండు వందే భారత్, రెండు శతాబ్ది రైళ్లకు అప్గ్రేడ్ స్పీడ్ లిమిట్స్ ప్రయోజనం చేకూరుస్తాయి. మరోవైపు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కనెక్టివిటీని పెంచడానికి ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. చెన్నై సెంట్రల్ నుంచి నాగర్ కోయిల్ వరకు, రెండోది మదురై నుంచి బెంగళూరు (bengaluru news) కంటోన్మెంట్ వరకు, మూడోది మీరట్ సిటీ-లక్నో మధ్య నడిచే మూడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ (narendra modi) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం