HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: లవ్ మ్యాటర్ లో ఫ్రెండ్ కు హెల్ప్ చేసి.. చివరకు ప్రాణాలే పోగొట్టుకుంది!

Crime news: లవ్ మ్యాటర్ లో ఫ్రెండ్ కు హెల్ప్ చేసి.. చివరకు ప్రాణాలే పోగొట్టుకుంది!

HT Telugu Desk HT Telugu

27 July 2024, 15:24 IST

  • బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్టల్ లో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. 24 ఏళ్ల యువతి కృతి కుమారి హత్య కేసులో నిందితుడు అభిషేక్ ను శనివారం భోపాల్ లో అరెస్టు చేశారు. కృతి కుమారి తన స్నేహితురాలి ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకుని చివరకు ప్రాణాలే పోగొట్టుకుందని పోలీసులు తెలిపారు.

లవ్ మ్యాటర్ లో ఫ్రెండ్ కు హెల్ప్ చేసి.. చివరకు ప్రాణాలే పోగొట్టుకుంది!
లవ్ మ్యాటర్ లో ఫ్రెండ్ కు హెల్ప్ చేసి.. చివరకు ప్రాణాలే పోగొట్టుకుంది!

లవ్ మ్యాటర్ లో ఫ్రెండ్ కు హెల్ప్ చేసి.. చివరకు ప్రాణాలే పోగొట్టుకుంది!

జూలై 23న బెంగళూరులోని కోరమంగళలోని పేయింగ్ గెస్ట్ ఫెసిలిటీలో కత్తిపోట్లకు గురైన కృతి కుమారి (24) హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు నిందితుడు అభిషేక్ ను శనివారం భోపాల్ లో అరెస్టు చేశారు. నిందితుడు అభిషేక్ బాధితురాలు కృతి కుమారి రూమ్మేట్ తో ప్రేమాయణం సాగించాడని, ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడని, వారి గొడవలో జోక్యం చేసుకోవడంతో కృతి కుమారిని హత్య చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి అరెస్ట్

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నిందితుడు అభిషేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్ లో కృతి కుమారి రూమ్మేట్, ఫ్రెండ్ అయిన అమ్మాయికి, అభిషేక్ కు మధ్య కొన్నాళ్లుగా ప్రేమ కొనసాగుతోంది. అభిషేక్ నిరుద్యోగి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అభిషేక్ కు, అతడి లవర్ కు మధ్య ఈ విషయంలో తరచూ గొడవ జరుగుతుండేది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న కృతి కుమారి అప్పుడప్పుడు ఈ వివాదాల్లో జోక్యం చేసుకునేది. అలాగే, అభిషేక్ తో దూరంగా ఉండాలని తన ఫ్రెండ్ కు సూచించింది. కొంతకాలం క్రితం కృతి కుమారి తన స్నేహితురాలిని కొత్త హాస్టల్ కు మారడానికి సహాయం చేసింది.

లవర్ ను దూరం చేస్తోందని..

ఈ నేపథ్యంలో, కృతి కుమారి వల్లనే తమ మధ్య దూరం పెరుగుతోందని, తన లవర్ ను తనకు దూరం చేస్తోందని కృతి కుమారిపై అభిషేక్ కోపం పెంచుకున్నాడు. ఆ కోపంలో జూలై 23న కృతి కుమారి ఉండే ఫ్లాట్ లోకి వెళ్లి, ఆమెను కత్తితో విచక్షణారహింగా పొడిచి హత్య చేశాడు.

సీసీ టీవీ వైరల్ ఫుటేజ్

ఈ దారుణ హత్యకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ శుక్రవారం ఇంటర్నెట్లో ప్రత్యక్షమై వైరల్ గా మారింది. ఆ వీడియోలో నిందితుడు పాలిథిన్ బ్యాగ్ పట్టుకుని హాస్టల్ కారిడార్ లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అభిషేక్ తలుపు తట్టి ఆమెను బయటకు లాగాడు. కుమారి ప్రతిఘటించినప్పటికీ హంతకుడు ఆమె గొంతు కోసి పలుమార్లు పొడిచాడు. బాధితురాలు కుప్పకూలిన తర్వాత కూడా హంతకుడు ఆమె జుట్టు పట్టుకుని పలుమార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. గొడవ, అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా ఆమెను కాపాడలేకపోయారు.

విచారణ కొనసాగుతోంది..

భోపాల్ లో అభిషేక్ ను అరెస్టు చేసిన అనంతరం బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద మాట్లాడుతూ ట్రాన్సిట్ డిమాండ్ మేరకు నిందితుడిని బెంగళూరుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ‘‘అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి పోలీసు కస్టడీకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతాం. ఆ తర్వాతే మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని తెలిపారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్