తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vlogger Killed In Bengaluru: బెంగళూరులో మహిళా వ్లాగర్ హత్య; శవంతో రెండు రోజులు ఫ్లాట్ లోనే..

Vlogger killed in Bengaluru: బెంగళూరులో మహిళా వ్లాగర్ హత్య; శవంతో రెండు రోజులు ఫ్లాట్ లోనే..

Sudarshan V HT Telugu

26 November 2024, 20:22 IST

google News
  • Vlogger killed in Bengaluru: బెంగళూరులో అస్సాంకు చెందిన ఒక మహిళా వ్లాగర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన తరువాత నిందితుడు ఆ మృతదేహంతో రెండు రోజులు ఫ్లాట్ లోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. నవంబర్ 23న హతురాలు మాయా గొగోయ్, నిందితుడు ఆరవ్ హర్నీ సర్వీస్ అపార్ట్మెంట్లోకి వచ్చారు.

 బెంగళూరులో మహిళా వ్లాగర్ హత్య
బెంగళూరులో మహిళా వ్లాగర్ హత్య (YouTube/@mayagogoi8242)

బెంగళూరులో మహిళా వ్లాగర్ హత్య

Vlogger killed in Bengaluru: అస్సాంకు చెందిన వ్లాగర్ మాయా గొగోయ్ మంగళవారం బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలోని ఓ సర్వీస్ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గొగోయ్ ను ఆమె స్నేహితుడు ఆరవ్ హర్నీ కత్తితో పొడిచి చంపాడని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆరవ్ హార్నీ కేరళకు చెందినవాడని తెలిపారు.

నవంబర్ 23న హత్య..

మూడు రోజుల క్రితం అంటే నవంబర్ 23న మయా గొగోయ్, ఆరవ్ హర్నీ సర్వీస్ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించారని, ఆ రోజు నుంచి అక్కడే ఉన్నారని, ఆ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలు నిర్ధారించాయి. నిందితుడు ఆరవ్ హర్నీ వ్లాగర్ మాయా గొగోయ్ ఛాతీలో పలుమార్లు కత్తితో పొడిచాడని, దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఆమెను హత్య చేసిన తర్వాత నిందితుడు రెండు రోజుల పాటు ఆమె మృతదేహంతోనే ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం ఉదయం హర్నీ సర్వీస్ అపార్ట్ మెంట్ నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. హత్య (murder case) కేసు నమోదు చేసి నిందితుడి కోసం బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తు ప్రారంభం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె పనిచేస్తున్న హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కు ఓ బృందాన్ని పంపించామని పోలీసులు తెలిపారు. నిందితుడు కేరళకు చెందినవాడని, దీనిపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) డి.దేవరాజ్ తెలిపారు. అస్సామీ వ్లాగర్ మాయా గొగోయ్ కోరమంగళలో పనిచేస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం మరో ఘటన

రెండు రోజుల క్రితం బెంగళూరులోని నేలమంగళ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ బాత్రూంలో 24 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలి లక్ష్మి తన భర్త వెంకటరమణతో కలిసి నేలమంగళలోని బంధువుల ఇంటికి వెళ్లింది. త్వరగా స్నానం చేస్తానని చెప్పి బాత్రూంలోకి వెళ్లింది. చాలా సేపటి వరకు ఆమె బయటకు రాకపోవడంతో ఆందోళన నెలకొంది. నీరు, గీజర్ శబ్దం వినిపించలేదు. లక్ష్మి భర్త, ఆమె బంధువులు తలుపు తట్టినా స్పందన లేదు. వెంకటరమణ తలుపు పగులగొట్టి చూడగా బాత్రూమ్ ఫ్లోర్ లో భార్య కదలకుండా పడి ఉంది. లక్ష్మి ముఖంపై ఉన్న వింత గుర్తులు చూసి కుటుంబ సభ్యులతో పాటు పరిశోధకులు కూడా అవాక్కయ్యారు. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. బాత్రూమ్ ను, ఇంటిని పరిశీలించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పంపారు.

తదుపరి వ్యాసం