తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Air India Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య; ఎమర్జెన్సీ ల్యాండింగ్; గంట పాటు ఆకాశంలో చక్కర్లు

Air India flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య; ఎమర్జెన్సీ ల్యాండింగ్; గంట పాటు ఆకాశంలో చక్కర్లు

Sudarshan V HT Telugu

11 October 2024, 20:32 IST

google News
    • Air India flight: షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో, ఆ విమానాన్ని విజయవంతంగా తిరుచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సందర్భంగా తిరుచ్చి ఏర్ పోర్ట్ లో పూర్తి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 
షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య

షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య

Air India flight: షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో, బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో, పైలట్ ఏటీసీకి సమాచారమిచ్చారు. అనంతరం, విజయవంతంగా ఆ విమానాన్ని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం

ల్యాండింగ్ గేర్, బ్రేకులు, ఫ్లాప్స్ వంటి కీలక విధులను నియంత్రించడంలో కీలకమైన హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా విమానం ఐఎక్స్ 613 శుక్రవారం సాయంత్రం మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది. పైలట్ ఈ విషయాన్ని తిరుచ్చి విమానాశ్రయ అధికారులకు తెలియజేయడంతో, విమానాశ్రయంలో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ విమానాశ్రయంలో అన్ని ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ లను నిలిపివేశారు. అనంతరం, ఆ ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు.

గంట పాటు గగనతలంలోనే..

ల్యాండింగ్ కు ముందు, విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి వీలుగా, విమానంలోని అదనపు ఇంధనాన్ని పూర్తిగా కాల్చడానికి తిరుచ్చి గగనతలంలో ఆ విమానం గంటకు పైగా చక్కర్లు కొట్టింది. హైడ్రాలిక్ ఫెయిల్యూర్ గురించి పైలట్ గ్రౌండ్ కంట్రోల్ ను అప్రమత్తం చేశారని తిరుచ్చి విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక అధికారులు హామీ ఇచ్చారు. ‘‘ఇంధనాన్ని ఖాళీ చేయడానికి ప్రస్తుతం గగనతలం చుట్టూ తిరుగుతోంది. ముందుజాగ్రత్త చర్యగా అంబులెన్స్ లు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాం’’ అని జిల్లా కలెక్టర్ తెలిపారు. విమానం ల్యాండింగ్ కు అనుమతి కోసం ఎదురు చూస్తున్న సమయంలో విమానం తిరుచిరాపల్లి మీదుగా తిరుగుతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ flightradar24.com చూపించింది. విమానంలో 141 మంది సిబ్బంది, ప్రయాణికులు కలిపి విమానంలోమొత్తం 141 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. వారికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిర్ ఇండియా (air india) అధికారులు తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం