Pet Winter Care: చలికాలంలో పెంపుడు కుక్కలకు ఇబ్బందే.. ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి!
07 December 2024, 14:00 IST
- Pet Dog Winter Care: చలికాలంలో పెంపుడు కుక్కలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో వాటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Pet Winter Care: చలికాలంలో పెంపుడు కుక్కలకు ఇబ్బందే.. ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి!
చలికాలంలో మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. చల్లటి వాతావరణం సవాలుగా ఉంటుంది. పెంపుడు కుక్కలకు ఈ శీతాకాలంలో సమస్యగా అనిపిస్తుంది. అందుకే చలికాలంలో వీటిపట్ల కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చేయాలి. దీంతో వాటి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. చలికాలంలో పెంపుకు కుక్కల కోసం పాటించాల్సిన జాగ్రత్తలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
వెచ్చగా ఉండేలా..
శీతాకాలంలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ పెంపుడు కుక్కకు చలి ఎక్కువగా పెడుతుంది. జుట్టు ఎక్కువగా లేని వాటికి ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ కుక్క శరీరం వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వెటర్లు, జాకెట్స్ వేయాలి. ముఖ్యంగా బయటికి తీసుకెళ్లే సమయాల్లో ఇవి తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తపడాలి.
ఆహారం విషయంలో..
చలికాలంలో పెంపుడు కుక్కలకు కాస్త ఎక్కువగా ఆహారం అవసరం కావొచ్చు. శరీరంలోపల వెచ్చదనం కోసం క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. అందుకే ఎక్కువ తినిపించాల్సి ఉండొచ్చు. అలాగనీ మరీ ఎక్కువ కూడా తినిపించకూడదు. అందుకే అవసరమైతే సంబంధిత నిపుణులను సంప్రదించి.. మీ పెంపుడు కుక్కకు శీతాకాలంలో ఎంత ఆహారం ఇవ్వాలో సూచనలను తీసుకోవాలి. చలికాలంలో నీరసంగా ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు.
పాదాలు జాగ్రత్త.. గ్రూమింగ్ కూడా..
చల్లదనం వల్ల పెంపుడు కుక్క పాదాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే వీలైతే పాదాలకు సరిపోయే బూట్లు వేయడం మంచిది. కుక్క పాదాల కోసం ప్రత్యేకమైన బామ్స్ రాయాలి. పాదాలు పగిలి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలి. కుక్క జుట్టుకు గ్రూమింగ్ చేయించాలి. బొచ్చు వదులుగా ఉంటే చలి ప్రభావం శరీరంపై పెరుగుతుంది.
బయటికి ఎక్కువగా వద్దు
వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు పెంపుడు కుక్కను ఎక్కువగా బయటికి తిప్పకూడదు. చల్లటి గాలి ఎక్కువగా తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీంతో చలికాలంలో రోగాల బారిన పడే రిస్క్ తగ్గుతుంది.
నీరు తాగేలా చేయాలి
మనుషుల్లాగే కుక్కలకు కూడా చలికాలంలో పెద్దగా దాహం వేయదు. అందుకే నీరు తక్కువగా తాగుతుంది. దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది. అందుకే శీతాకాలంలో మీ కుక్క సరిపడా నీరు తాగేలా చేయాలి. వాటిని నీరు తాగించాలి.
ఇంట్లోనే గేమ్స్
చలికాలంలో బయటికి తీసుకోపోని కారణంగా పెంపుడు కుక్క కాస్త డల్‍గా ఉంటే అవకాశం ఉంటుంది. అందుకే చురుగ్గా ఉండేలా ఇంట్లోనే వాటికి ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వాలి. వాటికి ట్రైనింగ్ ఇవ్వొచ్చు. కొన్ని బొమ్మలతో ఆడుకునేలా చేయవచ్చు. దీంతో శునకాలు మంచి యాక్టివ్‍గా ఉంటాయి.
వైద్య పరీక్షలు చేయించాలి
చలికాలంలో కుక్కలు కూడా ఎక్కువగా రోగాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు బయటికి కనిపించకపోవచ్చు. నొప్పులు ఎక్కువగా ఉండొచ్చు. అందుకే చలికాలంలో పెంపుడు కుక్కలకు నెలకు ఓసారైనా వైద్య పరీక్షలు చేయించడం మేలు. అలాగే, ఎక్కువగా ఇబ్బందిగా, నీరసంగా కనిపిస్తే వెంటనే సంబంధిత నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి.